Amit Shah: లొంగిపోవాల్సిందే.. మావోయిస్టులతో మాట్లాడటానికి ఏమీ లేదు: అమిత్‌షా కీలక వ్యాఖ్యలు..

మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు అమిత్‌షా. బస్తర్‌లో ఆయుధాలు పట్టిన యువత సరెండర్‌ కావాలని పిలుపునిచ్చారు. మార్చి 31 , 2026 నాటికి దేశంలో నక్సలిజాన్ని అంతం చేస్తామని ప్రకటించారు. చత్తీస్‌గఢ్‌ పర్యటనలో భాగంగా అమిత్ షా శనివారం బస్తర్‌లో దసరా దర్బార్‌కు హాజరయ్యారు.

Amit Shah: లొంగిపోవాల్సిందే.. మావోయిస్టులతో మాట్లాడటానికి ఏమీ లేదు: అమిత్‌షా కీలక వ్యాఖ్యలు..
Amit Shah

Updated on: Oct 04, 2025 | 9:27 PM

మావోయిస్టులపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు చేశారు. 2026 మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని మరోసారి పేర్కొన్నారు. మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదు.. మావోయిస్టులతో మాట్లాడటానికి ఏమీ లేదు.. ఆయుధాలు వదిలేసి లొంగిపోతామంటే స్వాగతిస్తాం.. లొంగిపోయిన వారందరికీ పునరావసం కల్పిస్తాం..అంటూ స్పష్టంచేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా శనివారం చత్తీస్‌గఢ్‌లో సుడిగాలి పర్యటన చేశారు. బస్తర్‌లో దసరా దర్బార్‌కు హాజరయ్యారు. ఆదివాసీలతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. బస్తర్‌ అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎన్నో పథకాలు తీసుకొచ్చిందన్నారు. మావోయిస్టులు ఆయుధాలు విడిచి లొంగిపోతే పునరావాసం కల్పిస్తామన్నారు అమిత్‌షా .

మావోయిస్టులు ఆయుధాలు వదిలి లొంగిపోయేలా ఆదివాసీ నేతలు ఒత్తిడి తేవాలన్నారు అమిత్‌షా. మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదన్నారు. ఏవిషయంపై చర్చలు కావాలంటున్నారో చెప్పాలన్నారు. మార్చి 31, 2026 నాటికి దేశంలో మావోయిస్టులను నిర్మూలిస్తామని అమిత్‌షా మరోసారి స్పష్టం చేశారు. ప్రభుత్వంతో చర్చల విషయంలో మావోయిస్టుల అగ్రనేతల మధ్య విభేదాలు నెలకొన్న సమయంలో అమిత్‌షా ప్రకటనకు ప్రాధాన్యత సంతరించుకంఉది.

మావోయిస్టులతో ఇక ప్రభుత్వం ఎటువంటి చర్చలు జరపదని.. ఆయుధాలు వదిలేసి లొంగిపోయేందుకు ముందుకు వస్తే స్వాగతిస్తామన్నారు అమిత్‌షా. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన వివిధ ప్రయోజనాలు అందిస్తామని..పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

మావోయిస్టులు తమతో చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారని.. ఇప్పుడు వారితో మాట్లాడడానికి ఏముందని అమిత్‌షా ప్రశ్నించారు. బస్తర్‌ లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ ప్రాంతంలో ఆయుధాలతో శాంతికి విఘాతం కలిగించే వారికి భద్రతా దళాలు తగిన సమాధానం ఇస్తాయని మావోయిస్టులను హెచ్చరించారు.

మార్చి 31, 2026 తర్వాత ఇటువంటి గ్రామాల అభివృద్ధిని మావోయిస్టులు అడ్డుకోలేరని అమిత్‌షా స్పష్టం చేశారు. గత పదేళ్లలో మోదీ ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్‌ అభివృద్ధి కోసం రూ.4లక్షల కోట్లకు పైగా నిధులు కేటాయించిందని.. భవిష్యత్తులో మరిన్ని నిధులు మంజూరు చేస్తామని తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..