పిల్లలకు థర్డ్ కోవిద్ వేవ్ వల్ల పెద్దగా ముప్పు లేకపోవచ్చు……లాన్సెట్ నిపుణుల నివేదిక

| Edited By: Phani CH

Jun 13, 2021 | 2:45 PM

థర్డ్ కోవిద్ వేవ్ లో పిల్లలకు తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తక పోవచ్చునని లాన్సెట్ నివేదిక తెలిపింది. ఇందుకు ఆధారాలు లేవని స్పష్టం చేసింది.

పిల్లలకు థర్డ్ కోవిద్ వేవ్ వల్ల పెద్దగా ముప్పు లేకపోవచ్చు......లాన్సెట్ నిపుణుల నివేదిక
Children Will Be Affected W
Follow us on

థర్డ్ కోవిద్ వేవ్ లో పిల్లలకు తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తక పోవచ్చునని లాన్సెట్ నివేదిక తెలిపింది. ఇందుకు ఆధారాలు లేవని స్పష్టం చేసింది. బాలల్లో ఇన్ఫెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మైల్డ్ సింప్టమ్స్ తో పోల్చవచ్చునని అభిప్రాయపడింది. ప్రముఖ పిల్లల వైద్య నిపుణులతో కూడిన లాన్సెట్ కోవిద్-19 కమిషన్ ఆఫ్ ఇండియా టాస్క్ ఫోర్స్ ఈ విషయాన్ని వెల్లడిస్తూ…కోవిద్ సోకిన చాలా మంది పిల్లల్లో ఎసింప్టోమాటిక్ లక్షణాలు..అవి కూడా స్వల్పంగా ఉంటాయని వివరించింది. ‘ఇండియాలో పీడియాట్రిక్స్ కోవిద్-19 పేరిట ఈ రిపోర్టును విడుదల చేశారు. పెద్దలతో పోలిస్తే వీరిలో డయేరియా, వాంతులు, పొత్తికడుపులో నొప్పి వంటివి తక్కువగా ఉంటాయని, గ్యాస్ట్రో ఇంటస్టైనల్ సింప్టమ్స్ కూడా తక్కువేనని నిపుణులు తెలిపారు. కానీ వయస్సు పెరిగేకొద్దీ సీవీయారిటీ కూడా పెరిగినా పెరగవచ్చునని వారు అభిప్రాయపడ్డారు. పదేళ్ల లోపు చికిత్స పొందుతున్న దాదాపు 2,600 ఆస్పత్రులలోని డేటాను తాము సేకరించినట్టు వారు పేర్కొన్నారు. తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలలోని 10 ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్ నుంచి దీన్ని సేకరించినట్టు వీరు వెల్లడించారు. బాలల్లో మరణాల రేటు 2.4 శాతం ఉందని, అయితే అనువంశిక రుగ్మతలు కూడా వీరి అనారోగ్యానికి తోడై ఉండవచ్చునని నిపుణులు అంటున్నారు. 5 శాతం కన్నా తక్కువగా పిల్లలు ఆసుపత్రుల్లో అడ్మిట్ అవుతున్నారని తెలిపారు.

ఈ కోవిద్ ఆంక్షలను సడలించిన నేపథ్యంలో ఒక వేళ స్కూళ్ళు తెరచినా అత్యంత అప్రమత్తంగా ఉండాలని వివిధ రాష్ట్రాలకు ఈ పీడియాట్రిక్స్ టాస్క్ ఫోర్స్ బృందం సూచించింది. అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డా.రణదీప్ గులేరియా కూడా నిన్న ఇదే విధమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Srisailam : శ్రీశైలంలో బయటపడుతోన్న ప్రాచీనకాలం నాటి అద్భుతాలు, మొన్న గుప్తనిధులు.. నేడు అజరామరమైన తామ్ర శాసనాలు

Mahesh Babu: మహేష్ బర్త్ డే కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులు.. మరి సూపర్ స్టార్ సార్ప్రైజ్ ఇస్తారా .?