MP Quota in KV Admissions: ‘కేవీల్లో ప్రవేశాలకు ఎంపీ కోటా పునరుద్ధరణ’.. కేంద్రం సమాధానం ఇదే

|

Aug 01, 2024 | 3:43 PM

కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు ఎంపీల కోటాను పునఃప్రారంభించే ప్రతిపాదనను విద్యా మంత్రిత్వ శాఖ (MoE) బుధవారం (జులై 31) తోసిపుచ్చింది. రాజ్యసభలో శివసేన యుబీటీ ఎంపీ ప్రియాంక చతుర్వేది లిఖితపూర్వకంగా అడిగిన ప్రశ్నకు సమాధానంగా విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి ఈ మేరకు వెల్లడించారు. ఎంపీ కోటాను పునరుద్ధరించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం యోచించడం లేదని మరోసారి..

MP Quota in KV Admissions: కేవీల్లో ప్రవేశాలకు ఎంపీ కోటా పునరుద్ధరణ.. కేంద్రం సమాధానం ఇదే
MP Quota in KV Admissions
Follow us on

న్యూఢిల్లీ, ఆగస్టు 1: కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు ఎంపీల కోటాను పునఃప్రారంభించే ప్రతిపాదనను విద్యా మంత్రిత్వ శాఖ (MoE) బుధవారం (జులై 31) తోసిపుచ్చింది. రాజ్యసభలో శివసేన యుబీటీ ఎంపీ ప్రియాంక చతుర్వేది లిఖితపూర్వకంగా అడిగిన ప్రశ్నకు సమాధానంగా విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి ఈ మేరకు వెల్లడించారు. ఎంపీ కోటాను పునరుద్ధరించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం యోచించడం లేదని మరోసారి తోసిపుచ్చారు. అటువంటి ప్రతిపాదన లేదని స్పష్టం చేశారు. గతంలో కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీల కోటాతోసహా ప్రత్యేక విభాగాల్లో ప్రవేశాలు కల్పించేందుకు అవకాశం ఉండేది. దాంతో తరగతుల్లో విద్యార్థి, టీచర్‌ నిష్పత్తి (PTR) భారీగా పెరిగిపోయేది. ఇది బోధనపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని, ఈ క్రమంలో ఈ కోటాను పునరుద్ధరించే ప్రతిపాదనేదీ ప్రస్తుతానికి కేంద్రం వద్ద లేదంటూ ఎంపీ స్పష్టం చేశారు.

ఎంపీల కోటాలో భాగంగా కేవీల్లో ప్రవేశాలకు ఒక ఎంపీ గరిష్ఠంగా 10 మంది వరకు పిల్లలను సిఫార్సు చేసేందుకు అవకాశం ఉండేది. ఎంపీలు – లోక్‌సభలో 543 మంది, రాజ్యసభలో 245 మంది ఉన్నారు. లోక్‌సభ, రాజ్యసభ కలిపి మొత్తం 788 సభ్యులుండగా, వీరందరూ ఒక ఏడాదికి దాదాపు 7,880 మంది విద్యార్థులను కేవీల్లో ప్రవేశాలు కల్పించేందుకు విచక్షణాధికారం ఉండేది.

వీరుకాక అటు జిల్లా మేజిస్ట్రేట్‌లు కూడా కేంద్రీయ విద్యాలయాల్లో స్పాన్సరింగ్ అథారిటీ కోటా కింద 17 మంది పిల్లలను సిఫార్సు చేసేందుకు అధికారం ఉండేది. ఇలా కేంద్రీయ విద్యాలయాల్లో యేటా విద్యార్ధుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుండటంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో కేవీల్లో ప్రవేశాలకు విద్యార్థులను సిఫార్సు చేసే పలు కోటాలను కేంద్ర ప్రభుత్వం 2022 ఏప్రిల్‌లో రద్దు చేసింది. ఈ కోటాను తిరిగి పునరుద్ధరించే యోచన లేదని తాజాగా మరోసారి స్పష్టం చేసింది. కాగా 2024-25 విద్యా సంవత్సరానికి ఇప్పటికే దేశ వ్యాప్తంగా అన్ని కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ ప్రక్రియ పూర్తైన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.