CJI N.V.Ramana: పార్లమెంటులో చర్చలేవీ..? సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ విచారం.. చట్టాలపై క్లారిటీ లేదని వ్యాఖ్య

| Edited By: Phani CH

Aug 15, 2021 | 1:17 PM

పార్లమెంటు పని తీరుపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణ విచారం వ్యక్తం చేశారు. అయితే సభలో జరుగుతున్న రభసలపై కాకుండా..ముఖ్యమైన చట్టాలపై చర్చలు జరగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

CJI N.V.Ramana: పార్లమెంటులో చర్చలేవీ..? సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ విచారం.. చట్టాలపై క్లారిటీ లేదని వ్యాఖ్య
N.v.ramana
Follow us on

పార్లమెంటు పని తీరుపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణ విచారం వ్యక్తం చేశారు. అయితే సభలో జరుగుతున్న రభసలపై కాకుండా..ముఖ్యమైన చట్టాలపై చర్చలు జరగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు పార్లమెంటు ఉభయ సభల్లో పూర్తిగా లాయర్లు ఉండేవారని..కానీ ఇప్పుడా పరిస్థితి కనిపించడంలేదని ఆయన చెప్పారు. ఇది చాలా విచారకరమన్నారు. చట్టాలపై స్పష్టత లేదని, చట్టం ఉద్దేశమేమిటో మనకు తెలియదని. అడ్వొకేట్లు, మేధావులు చట్ట సభల్లో లేకపోవడం వల్ల నష్టం జరుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. దేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టులో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. స్వాతంత్య్ర సమర యోధుల్లో చాలామంది లాయర్లు ఉండేవారని లోక్ సభ, రాజ్య సభ వారితో నిండిపోయి ఉండేవని పేర్కొన్నారు. నాడు పార్లమెంటులో డిబేట్లు నిర్మాణాత్మకంగా, అర్థవంతంగా జరిగేవని, ఆర్ధిక బిల్లులపై సభ్యులు చక్కని సూచనలు ఇచ్చేవారని ఆయన అన్నారు. అసలు చట్టాలపై విస్తృతంగా చర్చలు జరిగేవన్నారు. ఫలితంగా ప్రజలకు వీటిపై మంచి అవగాహన ఏర్పడేదని జస్టిస్ రమణఅభిప్రాయపడ్డారు.

అడ్వొకేట్లు తమ లీగల్ సర్వీసులకే పరిమితం కాకుండా పబ్లిక్ సర్వీసు కూడా చేయాలనీ ఆయన సూచించారు. మన పాలసీలను, సాధించినవాటిని సమీక్షించుకోవాల్సి ఉందని ఆయన చెప్పారు. దేశ చరిత్రలో 75 ఏళ్ళు అంటే సామాన్యం కాదని, జరిగిన, జరుగుతున్న అంశాలను రివ్యూ చేసుకుంటే సముచితమని ఆయన పేర్కొన్నారు. బాల్యంలో స్కూలుకు వెళ్ళినప్పుడు టీచర్లు బెల్లం ముక్క, చిన్న జెండా ఇచ్చేవారు.. అప్పుడు అదే గొప్ప విషయం.. కానీ ఇప్పుడు మనకు ఎంత ఉన్నా మనం సంతోషంగా లేము అని జస్టిస్ రమణ కొంత ఆవేదనగా వ్యాఖ్యానించారు. మన శాచ్యురేషన్ స్థాయులు చాలా అడుగంటిపోయాయని చెప్పారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: ఆఫ్ఘన్ దేశస్థులకు ఆశ్రయం కల్పించే యోచనలో భారత్..? అదే బాటలో అమెరికా, కెనడా..?

భారత్ తో భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలన్న అమెరికా అధ్యక్షుడు జోబైడెన్.. సాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు