Currency Printing: కరెన్సీ నోట్లు ముద్రించనున్నారా? లోక్‌సభలో క్లారిటీ ఇచ్చిన మంత్రి నిర్మలా సీతారామన్

|

Jul 26, 2021 | 5:20 PM

Currency Notes Printing: కరోనా పాండమిక్ నేపథ్యంలో ఢీలాపడిన దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కరెన్సీ నోట్ల ముద్రణ చేపట్టాలని కేంద్రానికి సూచనలు వస్తున్నాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.

Currency Printing: కరెన్సీ నోట్లు ముద్రించనున్నారా? లోక్‌సభలో క్లారిటీ ఇచ్చిన మంత్రి నిర్మలా సీతారామన్
Money
Follow us on

కరోనా పాండమిక్ నేపథ్యంలో ఢీలాపడిన దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కరెన్సీ నోట్ల ముద్రణ చేపట్టాలని కేంద్రానికి సూచనలు వస్తున్నాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది. కరెన్సీ నోట్లను ముద్రించే యోచన కేంద్రానికి లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో సోమవారం(జులై 26) స్పష్టంచేశారు. నోట్ల ముద్రణకు సంబంధించి ఎంపీ మాలా రాయ్ అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చిన నిర్మలా సీతారామన్.. దేశ ఆర్థిక మూలాలు బలంగా ఉన్నాయని స్పష్టంచేశారు. లాక్‌ డౌన్ ఆంక్షల సడలింపులతో క్రమంగా పరిస్థితులు సర్దుకుంటున్నాయని పేర్కొన్నారు. అలాగే ఆత్మ నిర్భర్ భారత్ వంటి కార్యక్రమాల వెన్నుదన్నుతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు(2021-22) ద్వితీయార్థం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ రికవరీ బాటలో నడుస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక మాంధ్యం పరిస్థితులను అధిగమించేందుకు నోట్ల ముద్రణ చేపట్టాలన్న ఆలోచన కేంద్రానికి లేదని నిర్మలా సీతారామన్ స్పష్టంచేశారు.

కరోనా పాండమిక్ దేశ ఆర్థికపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ కరెన్సీ నోట్లను ముద్రించాలని..దీన్ని కేంద్ర ప్రభుత్వం కరోనా కారణంగా సతమతమవుతున్న పేద ప్రజలు, చిరు వ్యాపారులకు పంపిణీ చేయాలని పలువురు ఆర్థిక నిపుణులు, ప్రతిపక్ష నేతలు సూచిస్తున్నారు. తద్వారా ఆర్థిక ఇక్కట్ల నుంచి వీరికి ఊరట లబిస్తుందని వారు పేర్కొన్నారు. ఇలా డబ్బు పంపిణీ చేయడాన్నే హెలికాప్టర్ మనీ లేదా హెలికాప్టర్ డ్రాప్ అని అంటారు. అయితే ఇలా కరెన్సీ నోట్లను ముద్రించి..ఉచితంగా పంపిణీ చేయడం ద్వారా ద్రవ్యోల్భణం పెరిగే అవకాశముంది. అందుకే కరెన్సీ నోట్ల ముద్రణ, పంపిణీని కొందరు ఆర్థిక నిపుణులు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరెన్సీ నోట్లను ముద్రించేది లేదని కేంద్రం స్పష్టంచేసింది.

Also Read..

సింగరేణి ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పదవీ విరమణ వయస్సు పెంచుతూ బోర్డ్ నిర్ణయం

కర్ణాటకలో ఊహించిందే జరిగింది.. సీఎం యడియూరప్ప రాజీనామా.. ఇక, కాబోయే కొత్త ముఖ్యమంత్రి ఎవరంటే..?

సినీ ఇండస్ట్రీలోకి మరో వారసురాలు.. ప్రముఖ లెజండరీ నటుడి మనవరాలు హీరోయిన్‏గా ..