Covid 19: చైనాలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులపై భారత్‌ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: ఐఐటీ ప్రొఫెసర్‌

|

Mar 16, 2022 | 8:48 AM

Covid 19: గత రెండేళ్లకుపైగా కరోనా (Corona) మహహ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. కరో్నా పుట్టినిల్లు అయిన చైనాలో పూర్తిగా తగ్గుముఖం పట్టి.. తాజాగా విజృంభిస్తోంది. మళ్లీ పాజిటివ్‌ కేసులు ..

Covid 19: చైనాలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులపై భారత్‌ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: ఐఐటీ ప్రొఫెసర్‌
Follow us on

Covid 19: గత రెండేళ్లకుపైగా కరోనా (Corona) మహహ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. కరో్నా పుట్టినిల్లు అయిన చైనాలో పూర్తిగా తగ్గుముఖం పట్టి.. తాజాగా విజృంభిస్తోంది. మళ్లీ పాజిటివ్‌ కేసులు భారీగా నమోదు అవుతుండటంతో అక్కడ కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ (Lockdown) ఆంక్షలు విధిస్తోంది చైనా ప్రభుత్వం. ఇప్పుడు చైనా (China)లో మళ్లీ విజృంభిస్తుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక హాంకాంగ్‌కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం.. చాలా దేశాల్లో కరోనావైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే చైనాలో కరోనా మళ్లీ ప్రకంపనలు సృష్టించింది. ప్రస్తుతం వుహాన్ వ్యాప్తి తర్వాత చైనా మళ్లీ కోవిడ్‌ సంక్షోభంతో పోరాడుతోంది. జాతీయ ఆరోగ్య కమిషన్‌ ప్రకారం.. దేశంలో ఒక్క రోజులో 5280 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇది రెండేళ్లలో రోజువారీ కేసుల సంఖ్య. ఇక్కడ పెరుగుతున్న కోవిడ్ కేసుల దృష్ట్యా షెన్‌జెన్ నగరంలో ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది. కఠినమైన ఆంక్షలు విధించింది. ఈ నగరం జనాభా 17 మిలియన్ కంటే ఎక్కువ. వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.  అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇతర అధికారులు పరిస్థితిని బట్టి అంటువ్యాధి ముగిసిందని ప్రకటించలేమని హెచ్చరించారు. కరోనా అంతమైపోయిందని ఎట్టి పరిస్థితుల్లో అనుకోవద్దని సూచిస్తోంది. జాగ్రత్తలు పాటించడం తప్పనిసరని చెబుతోంది.

చైనాలో పెరుగుతున్న కోవిడ్ కేసులు భారత్‌కు ఆందోళన కలిగిస్తున్నాయా?

ఇక చైనాలో మళ్లీ పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో భారత్‌లో ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) ప్రొఫెసర్, నేషనల్ కోవిడ్ సూపర్ మోడల్ కమిటీ అధిపతి డాక్టర్ ఎం విద్యాసాగర్ టీవీ9తో మాట్లాడుతూ.. భారతదేశంలోని ప్రస్తుత పరిస్థితులను చైనాలో పెరుగుతున్న కోవిడ్ కేసులతో పోల్చకూడదని అన్నారు. దేశంలో చేపట్టిన చర్యల వల్ల కరోనా అదుపులో ఉందన్నారు. ఇప్పుడు కరోనా అంత తీవ్రంగా లేదని, అందుకే దాని ప్రభావం పెద్దగా ఉండదన్నారు. హాంకాంగ్, దక్షిణ కొరియా వంటి దేశాల్లో ఈ వ్యాధిని సక్రమంగా నియంత్రించే బదులు అణచివేతకు గురిచేస్తున్నారని అన్నారు. ప్రెషర్ కుక్కర్‌పై మూత పెట్టి స్టవ్‌ మంటను పెంచుతూనే ఉండేలా చర్యలు చేపడుతున్నారన్నారు. ఈ చర్య ఎక్కువ కాలం కొనసాగదు. వారు సహజ రోగనిరోధక శక్తి కంటే వ్యాక్సిన్-ప్రేరిత రోగనిరోధక శక్తిపై ఆధారపడతారు. దీంతో ఆయా దేశాల్లో కోవిడ్‌ కేసులు పెరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

Children Vaccine: తల్లిదండ్రులకు అలర్ట్.. ఇవాళ్టి నుంచి 12-14 ఏళ్ల పిల్లలకు కోవిడ్ టీకా..

Holi 2022 – Covid 19: హోళీ పండుగ కోవిడ్ 19 ఫోర్త్ వేవ్‌ను ఆహ్వానిస్తుందా? నిపుణులు ఏం హెచ్చరిస్తున్నారు?