ఆర్టికల్ 370 రద్దు.. ‘విస్తృత ధర్మాసనానికా ? అవసరం లేదు’..సుప్రీంకోర్టు

| Edited By: Anil kumar poka

Mar 02, 2020 | 1:54 PM

జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించేందుకు ఉద్దేశించిన ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు.. వీటిని విస్తృత ధర్మాసనానికి నివేదించవలసిన అవసరం లేదని స్పష్టం చేసింది.

ఆర్టికల్ 370 రద్దు.. విస్తృత ధర్మాసనానికా ? అవసరం లేదు..సుప్రీంకోర్టు
Follow us on

జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించేందుకు ఉద్దేశించిన ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు.. వీటిని విస్తృత ధర్మాసనానికి నివేదించవలసిన అవసరం లేదని స్పష్టం చేసింది. జమ్మూ కాశ్మీర్ ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని కూడా పిటిషనర్లు సవాలు చేశారు. ప్రస్తుతం వీరి పిటిషన్లను జస్టిస్ రమణ నేతృత్వంలోని అయిదుగురు  జడ్జీల ధర్మాసనం విచారిస్తోంది. ఈ అభ్యర్థనలను ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలా అన్న అంశంపై కోర్టు గత జనవరి 23 న తన ఉత్తర్వులను రిజర్వ్ లో ఉంచింది. ఈ అధికరణంపై రెండు పాత తీర్పులను ప్రస్తావించిన అత్యున్నత న్యాయస్థానం.. ఆ తీర్పుల మధ్య తేడాలేవీ లేవని పేర్కొంది.

కాగా-కేంద్ర నిర్ణయం రాజ్యాంగ స్ఫూర్తికి విరుధ్దంగా ఉందని పిటిషనర్లు తమ పిటిషన్లలో ఆరోపించారు. అయితే  సున్నితమైన అంశాలు ఇమిడి ఉన్నందున తమ పిటిషన్లను విస్తృత ధర్మాసనానికి నివేదించాలని వీరు కోరారు.