రైలు ప్రయాణికులు ఇక తమ కోవిద్-19 ఆర్టీ-పీసీఆర్ నెగెటివ్ రిపోర్టులను తప్పనిసరిగా చూపాలన్న నిబంధనను రద్దు చేయాలని రైల్వే శాఖ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. దీని బదులు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ చూపితే అనుమతించాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఆరోగ్య సేతు యాప్ ద్వారా ఎవరు చూపినా ఫరవాలేదని.. ప్రయాణాలకు అనుమతించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అంటే ఒకవిధంగా ఇది వ్యాక్సిన్ తప్పనిసరి అని సూచిస్తోంది. ఈ పద్దతి వ్యాక్సినేషన్ ని ప్రోత్సహించడమే అవుతుంది. పలు రాష్ట్రాలు ఈ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖకు సూచించాయని, ఏ నెల 15 నాటికి ఈ ప్రతిపాదనను ధృవీకరించవచ్చునని అంటున్నారు. ఇప్పటివరకు దేశంలో కోవిద్ సెకండ్ వేవ్ బలంగా ఉన్న దృష్ట్యా.. రైలు ప్రయాణికులు తమ ఆర్టీ-పీసీఆర్ రిపోర్టులు తప్పనిసరిగా సమర్పించాలనే నిబంధన ఉండేది. అయితే కోవిద్ కేసులు తగ్గడంతోను, లాక్ డౌన్ ఆంక్షలు సడలించడంతోను ఈ రూల్ ని పక్కన పెట్టి వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ చాలు అనే ప్రొపోజల్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని యోచిస్తున్నట్టు చెబుతున్నారు.
ఇక ఇతర ట్రావెల్ సర్వీసులకు సంబంధించిన ప్రభుత్వ శాఖలు కూడా ఇదే విధానాన్ని పాటించవచ్చునని సమాచారం.. రైల్వే శాఖ తన నిర్ణయాన్ని మరికొన్ని రోజుల్లోనే ప్రకటించవవచ్చునని కూడా భావిస్తున్నారు. త్వరలోనే దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్ కొరత కూడా తీరనున్న నేపథ్యంలో ప్రతి వ్యక్తి టీకామందు తీసుకుంటాడని ఈ శాఖ అభిప్రాయపడుతోంది.
మరిన్ని ఇక్కడ చూడండి: Pfizer expands vaccine :12 ఏళ్ళ లోపు చిన్నారులకు ఫైజర్ వాక్సిన్..చిన్నారులపై క్లినికల్ ట్రయల్స్ పార్రంభం..?(వీడియో)