Co-WIN portal: కోవిన్ పోర్టల్ సురక్షితం.. ఎలాంటి డేటా లీక్ కాలేదు.. స్పష్టం చేసిన కేంద్రం

|

Jan 22, 2022 | 9:28 AM

No data leaked from Co-WIN portal: ప్రభుత్వానికి చెందిన కోవిన్ సర్వర్ నుంచి వేలాది మంది వ్యక్తిగత వివరాలు లీకయ్యాయన్న వార్తలు దేశంలో

Co-WIN portal: కోవిన్ పోర్టల్ సురక్షితం.. ఎలాంటి డేటా లీక్ కాలేదు.. స్పష్టం చేసిన కేంద్రం
Cyber Crime
Follow us on

No data leaked from Co-WIN portal: ప్రభుత్వానికి చెందిన కోవిన్ సర్వర్ నుంచి వేలాది మంది వ్యక్తిగత వివరాలు లీకయ్యాయన్న వార్తలు దేశంలో కలకలం రేపాయి. పలువురి పేర్లు, మొబైల్‌ నెంబర్లు, చిరునామాలు, కోవిడ్‌ పరీక్షా వివరాలతో కూడిన డేటా ఆన్‌లైన్‌లో కనిపిస్తుందంటూ ప్రచారం జరుగుతోంది. అయితే.. లీకైన వివరాలన్నీ రైడ్‌ ఫోరమ్స్‌ వెబ్‌సైట్‌లో ఒక సైబర్‌ క్రిమినల్‌ అమ్మకానికి కూడా పెట్టినట్లు పేర్కొంటున్నారు. అయితే.. ఈ వివరాలు డార్క్‌ వెబ్‌లో కూడా లభిస్తున్నాయని, సెర్చ్‌ ఇంజన్లలో ఉన్న దాదాపు 9 లక్షల వివరాలను గూగుల్‌ ఇండెక్స్‌ చేసిందని సైబర్‌ సెక్యూరిటీ నిపుణుడు రాజశేఖర్‌ రాజాహారియా ట్వీట్‌ చేయడంతో ఈ విషయం సంచలనంగా మారింది.

అయితే.. ఈ వివరాలన్నీ కోవిన్‌ పోర్టల్‌లో అప్‌లోడింగ్‌కు ఉంచిన డేటా అని నిపుణులు అభిప్రాయపడ్డారు. కరోనా కాలంలో నిబంధనల పర్యవేక్షణ నుంచి వ్యాక్సినేషన్‌ వరకు పలు అంశాలకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం డిజిటలైజ్ చేసిన సంగతి తెలసిందే. అయితే దీని డేటానే లీకైందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పలువురు నిపుణులు సూచించారు. ఈ ఘటనకు సంబంధించిన వార్తలు దేశంలో కలకలం రేపడంతో కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పందించింది.

కోవిన్‌ పోర్టల్‌ నుంచి ఎలాంటి డేటా లీక్ కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ స్పష్టంచేసింది. ఈ ప్లాట్‌ఫామ్‌లోని ప్రజల వివరాలు సురక్షితంగా ఉన్నాయని.. ఎవ్వరూ భయపడాల్సిన పనిలేదని పేర్కొంది. కోవిన్‌లో వ్యక్తుల చిరునామాలు, ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షా వివరాలు సేకరించలేదంటూ వెల్లడించింది. కోవిన్‌ పోర్టల్‌ నుంచి డేటా లీకైందన్న వార్తలు వస్తున్నాయని అవన్నీ అబద్దాలే అంటూ పేర్కొంది. ఈ పోర్టల్‌ సురక్షితమని, ఎలాంటి వివరాలు లీక్ కాలేదని మంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలిపింది.

Also Read:

Hyderabad: కొట్టెసిన స్కూటీతో దర్జాగా దొంగతనాలు చేసి చెక్కేశాడు.. మరి పోలీసులు ఏం చేస్తున్నారంటే..

US-Canada Border: సరిహద్దు దాటుతూ భారతీయ కుటుంబం బలి.. శిశువు సహా..