JDU National President Lalan Singh: జనతాదళ్ (యునైటెడ్) జేడియు జాతీయ అధ్యక్షులుగా ఆ పార్టీ ఎంపీ రాజీవ్ రంజన్ (లాలన్ సింగ్) శనివారం ఎన్నికయ్యారు. ఇప్పటివరకూ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఆర్‌సిపి సింగ్ తాను కేంద్ర కేబినెట్‌లో మంత్రి అయ్యారు. దీంతో తాను ఆ పదవిని వదలుకోక తప్పలేదు. ఈ నేపథ్యంలో నూతన అధ్యక్షుడి ఎంపికను జేడీయూ చేపట్టింది. దీంతో కొత్త అధ్యక్షుడిగా లాలన్ సింగ్‌ను ఎన్నుకుంది ఆపార్టీ. బీహార్‌లోని ముంగేర్ ఎంపీ అయిన లాలన్ సింగ్ చిరకాలంగా బీహార్ సీఎం, పార్టీ ప్రధాన నేత అయిన నితీష్‌కుమార్‌కు అత్యంత సన్నిహితులుగా ఉంటూ వస్తున్నారు.
లాలన్ సింగ్ బీహార్ రాజకీయాల్లో సుపరిచితుడైన రాజీవ్ రంజన్ సింగ్ బీహార్ లోని పాట్నాలో జన్మించారు. భాగాల్పుర్ విశ్వవిద్యాలయం పరిధిలోని టి.ఎన్.బి కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. లాలన్ సింగ్ విద్యార్ధి రాజకీయాల్లో కీలకమైన వ్యక్తి గా ఎదిగారు. 1974లో లోక్ నాయక్ జె.పి.నారాయణ్ ప్రారంభించిన ఉద్యమంలో పాల్గొని జైలుకు సైతం వెళ్లారు. ఉద్యమ సమయంలో ప్రస్తుత బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గారితో ఏర్పడిన పరిచయం రాజకీయాల్లోకి ప్రవేశించేలా చేసింది.1977లో జనతాపార్టీ లో చేరిన నితీష్ కుమార్ అనుచరుడిగా ఆయానతోనే రాజకీయ ప్రయాణం ప్రారంభించారు.
ఆ తరువాత కాలంలో సోషలిస్టు పార్టీల్లో పూర్తి కాలం పనిచేసిన లాలన్ 1993లో లాలు నితీష్ కుమార్ గార్ల మధ్య ఏర్పడిన భేదాభిప్రాయాలు కారణంగా నితీష్ కుమార్ స్థాపించిన సమతా పార్టీలో చేరారు. అప్పటి నుండి ఇప్పటివరకు నీతిశ్ సన్నిహితుడిగా మేలుగుతూ ఉన్నారు. 2003లో జనతాదళ్(యునైటెడ్) ఏర్పడిన తరువాత ఆ పార్టీలో కొనసాగుతున్నారు.2000లో రాజ్యసభ సభ్యుడిగా, 2004,2009,2019లలో లోక్ సభ సభ్యుడిగా, 2014లో బీహార్ మండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2015 నుండి 2019 వరకు జితన్ రామ్ మంజి, నీతిశ్ కుమార్ మంత్రివర్గాల్లో కేబినెట్ మంత్రిగా పనిచేశారు. లాలన్ సింగ్ రాజకీయాల్లో సుదీర్ఘ కాలం నుంచి నీతిశ్ కుమార్ కోసం ఎన్నో ఒత్తిడులను అధిగమించారు. బీహార్ రాజకీయాల్లో నితీశ్ కుమార్ పట్టును నిలబెట్టేందుకు లాలన్ సింగ్ తీవ్రంగా కృషి చేస్తున్నారు.
Read Also…