జేడీయు‌లో కేంద్ర కేబినెట్ విస్తరణ చిచ్చు.. సీఎం నితీష్, జేడీయు నేత భిన్నస్వరాలు…

| Edited By: Phani CH

Jul 07, 2021 | 1:08 PM

ప్రధాని మోదీ కేబినెట్ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ జరగడానికి మరి కొన్ని గంటలు మాత్రమే ఉండగా బీహార్ జీడీ-యూలో లుకలుకలు మొదలయ్యాయి.

జేడీయు‌లో కేంద్ర కేబినెట్ విస్తరణ చిచ్చు.. సీఎం నితీష్, జేడీయు నేత భిన్నస్వరాలు...
Bihar Cm Nitish Kumar
Follow us on

ప్రధాని మోదీ కేబినెట్ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ జరగడానికి మరి కొన్ని గంటలు మాత్రమే ఉండగా బీహార్ జీడీ-యూలో లుకలుకలు మొదలయ్యాయి. కేంద్ర కేబినెట్ లో తాము చేరుతామని, తమకు ఎన్ని పదవులు ఇచ్చినా సమ్మతమేనని బీహార్ సీఎం నితీష్ కుమార్ వ్యాఖ్యానించగా..నాలుగు కన్నా తక్కువ పదవులు ఇస్తే సహించబోమని, కేబినెట్ లో తాము చేరబోమని జేడీ-యూ నాయకుడొకరు స్పష్టం చేశారు. కేవలం రెండు పదవులు మాత్రమే ఇస్తే అది తమ రాష్ట్రంలో సామాజిక సమతుల్యాలపై ప్రభావం చూపుతుందని, రాజకీయ పోకడ కూడా మారుతుందని ఆ నాయకుడు చెప్పారు. తమ పార్టీ నుంచి 16 మంది ఎంపీలు ఉన్నారని, అందువల్ల 4 బెర్తులు కావాలని తాము కోరుతున్నట్టు ఆయన తెలిపారు. అటు నితీష్ మాత్రం తమకు ఏ ఫార్ములా గురించి గానీ తెలియదని, బీజేపీ ఎన్ని పోస్టులు ఇచ్చినా ప్రభుత్వంలో చేరుతామని అంటున్నారు. ప్రధాని ఏది నిర్ణయించినా అది తమకు అంగీకారయోగ్యమేనన్నారు. అయితే ఢిల్లీలో ఉన్న జేడీ-యూ జాతీయ అధ్యక్షుడు ఆర్.సి.పీ సింగ్ కే మొత్తం వ్యవహార బాధ్యతను పార్టీ అప్పగించింది. మొత్తానికి జేడీ-యూకీ రెండు పదవులు దక్కవచ్చునని తెలుస్తోంది.

ఇక కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ట్విట్టర్లో ఎవరు ఎక్కువగా ఎదిరిస్తారో.. ఎవరు ఎక్కువగా విమర్శిస్తారో వారికి ఈ కేబినెట్ లో మంత్రి పదవులు దక్కుతాయని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. ప్రధాని మోదీ కేబినెట్ కూర్పును తాము ముందే ఊహిస్తున్నామని.. రాహుల్ మీద ఎంత ఎక్కువ ట్వీట్లు చేస్తే వారికే ప్రమోషన్ లభిస్తుందని ఈ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా పేర్కొన్నారు. ఇది అందరికీ తెలిసిందేనన్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Breaking: సినీ పరిశ్రమకు షాక్ ఇచ్చిన జగన్ సర్కార్.. ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకు టికెట్ ధరలు.!

Mamata Banerjee: బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి రూ. 5 లక్షల జరిమానా.. కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు.. ఎందుకంటే ..?