ప్రపంచ దేశాలకు పోటీ ఇవ్వాలంటే సంస్కరణలు చాలా ముఖ్యం.. లేదంటే కష్టమే అంటున్న ప్రముఖ..

|

Dec 09, 2020 | 5:29 AM

కఠినమైన సంస్కరణలు లేకుండా చైనా వంటి అగ్రదేశాలకు భారత్ పోటీ ఇవ్వలేదని అంటున్నారు నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్.

ప్రపంచ దేశాలకు పోటీ ఇవ్వాలంటే సంస్కరణలు చాలా ముఖ్యం.. లేదంటే కష్టమే అంటున్న ప్రముఖ..
Follow us on

కఠినమైన సంస్కరణలు లేకుండా చైనా వంటి అగ్రదేశాలకు భారత్ పోటీ ఇవ్వలేదని అంటున్నారు నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్. స్వరాజ్య మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వూలో అమితాబ్ ఇండియాకు సంబంధించిన పలు విషయాలను వెల్లడించారు. భారత్‌లో ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుందని, ఇక్కడ కఠినమైన సంస్కరణలకు అవకాశం ఉండదని వెల్లడించారు.

మైనింగ్, బొగ్గు, కార్మిక, వ్యవసాయం అన్ని రంగాల్లో కేంద్ర ప్రభుత్వం కఠిన సంస్కరణలు అమలు చేస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని ముందుకు తీసుకెళ్లడంలో విఫలమవుతున్నాయని పేర్కొన్నారు. అలాగే డిస్కంలను ప్రైవేటీకరణ చేయమని ఇప్పటికే కేంద్ర పాలితాలను కోరామని అన్నారు. డిస్కంలు మరింత పోటీ ఇచ్చే విధంగా తయారై తక్కువ రేటుకే విద్యుత్‌ను అందిస్తే బాగుంటుందని తెలిపారు. ప్రపంచ దేశాలకు భారత్ పోటీ ఇవ్వాలంటే సంస్కరణలు చాలా ముఖ్యమని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగంలో కూడా చాలా మార్పులు చేయాలన్నారు. రైతులు తమకు నచ్చిన విధంగా పంటను అమ్ముకునే విధంగా కొత్త చట్టాలు వచ్చాయి. కానీ వాటిని వారు వ్యతిరేకిస్తున్నారు. భారత్ తయారీ హబ్‌గా ఎదిగేందుకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సహాకాల పథకం కీలక పాత్ర షోషిస్తుందని ప్రకటించారు. ఆత్మ నిర్భర్ నినాదంతో త్వరలోనే భారత కంపెనీల సత్తా బయటకు వస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు.