ఆ సమస్య దేశమంతా ఉంది.. డ్రగ్స్ వ్యాఖ్యలపై దుమారం

బాలీవుడ్‌కు చెందిన హీరో, హీరోయిన్లపై శివసేన ఎమ్మెల్యే మజీందర్‌ సిర్సా చేసిన వ్యాఖ్యలు రచ్చ రాజేస్తున్నాయి. ఆయన వ్యాఖ్యలపై దంగల్ డైరెక్టర్ నితేశ్ తివారీ రెస్పాండ్ అయ్యారు. డ్రగ్స్ వ్యవహారం కేవలం సినీ ఇండస్ట్రీలో మాత్రమే లేదని, ఇది దేశమంతా ఉందని బాలీవుడ్ నటులను వెనుకేసుకొచ్చారు. ఈ విధంగా ప్రముఖులను కించపరిచేలా మాట్లాడటం సరికాదన్నారు. తాను తీసే చిత్రాలన్నీ డ్రగ్స్‌కు వ్యతిరేకంగానే ఉంటాయని దంగల్, బరేలీ కి బర్పీ వంటి సినిమాలు చూసి అర్ధం చేసుకోవచ్చన్నారు. అసలు […]

  • Tv9 Telugu
  • Publish Date - 2:24 pm, Sat, 3 August 19
ఆ సమస్య దేశమంతా ఉంది.. డ్రగ్స్ వ్యాఖ్యలపై దుమారం

బాలీవుడ్‌కు చెందిన హీరో, హీరోయిన్లపై శివసేన ఎమ్మెల్యే మజీందర్‌ సిర్సా చేసిన వ్యాఖ్యలు రచ్చ రాజేస్తున్నాయి. ఆయన వ్యాఖ్యలపై దంగల్ డైరెక్టర్ నితేశ్ తివారీ రెస్పాండ్ అయ్యారు. డ్రగ్స్ వ్యవహారం కేవలం సినీ ఇండస్ట్రీలో మాత్రమే లేదని, ఇది దేశమంతా ఉందని బాలీవుడ్ నటులను వెనుకేసుకొచ్చారు. ఈ విధంగా ప్రముఖులను కించపరిచేలా మాట్లాడటం సరికాదన్నారు.

తాను తీసే చిత్రాలన్నీ డ్రగ్స్‌కు వ్యతిరేకంగానే ఉంటాయని దంగల్, బరేలీ కి బర్పీ వంటి సినిమాలు చూసి అర్ధం చేసుకోవచ్చన్నారు. అసలు అక్కడేం జరిగిందో తెలియకుండా మాట్లాడటం మంచిది కాదన్నారు నితేష్. ఈ సమస్య దేశమంతా వ్యాపించి ఉందని గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. బాలీవుడ్ హీరో, హీరోయిన్లు దీపికా పదుకొణె, కరణ్ జోహార్, షాహిద్ కపూర్, వరుణ్ ధావన్ తదితరులు డ్రగ్స్ తీసుకుంటున్నారంటూ ఆయన ట్వీట్ చేయడం దుమారాన్ని రేపింది.