మెర్సీ పిటిషన్ తిరస్కరణపై సుప్రీంకోర్టుకెక్కిన నిర్భయ దోషి ముకేష్ సింగ్

తన మెర్సీ పిటిషన్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ నిర్భయ దోషుల్లో ఒకడైన ముకేష్ సింగ్  సుప్రీంకోర్టుకెక్కాడు. ఇతని క్షమాభిక్ష పిటిషన్ ని రాష్ట్రపతి ఈ నెల 17 న తోసిపుచ్చారు. దోషులు కావాలనే న్యాయ ప్రక్రియను జాప్యం చేసేందుకు యత్నిస్తున్నారని తీహార్ జైలు అధికారుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వ్యాఖ్యానించిన కొన్ని గంటల్లోనే ముకేష్ ఈ మేరకు పిటిషన్ వేశాడు. వినయ్, ముకేష్ సింగ్ ల క్యురేటివ్ పిటిషన్లను సుప్రీంకోర్టు […]

మెర్సీ పిటిషన్ తిరస్కరణపై సుప్రీంకోర్టుకెక్కిన నిర్భయ దోషి ముకేష్ సింగ్

Edited By:

Updated on: Jan 25, 2020 | 7:52 PM

తన మెర్సీ పిటిషన్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ నిర్భయ దోషుల్లో ఒకడైన ముకేష్ సింగ్  సుప్రీంకోర్టుకెక్కాడు. ఇతని క్షమాభిక్ష పిటిషన్ ని రాష్ట్రపతి ఈ నెల 17 న తోసిపుచ్చారు. దోషులు కావాలనే న్యాయ ప్రక్రియను జాప్యం చేసేందుకు యత్నిస్తున్నారని తీహార్ జైలు అధికారుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వ్యాఖ్యానించిన కొన్ని గంటల్లోనే ముకేష్ ఈ మేరకు పిటిషన్ వేశాడు.

వినయ్, ముకేష్ సింగ్ ల క్యురేటివ్ పిటిషన్లను సుప్రీంకోర్టు ఇటీవలే కొట్టివేసింది. ఇదిలా ఉండగా.. తాము అన్ని డాక్యుమెంట్లను ఇదివరకే సమర్పించామని చెప్పిన పబ్లిక్ ప్రాసిక్యూటర్.. చట్టాన్ని నీరు గార్చేందుకే దోషులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.  ఇక.. వినయ్ శర్మ తరఫున అతని లాయర్ కొత్త కొత్త విషయాలను బయటపెడుతున్నారు. వినయ్ ఎన్నో పెయింటింగులు వేశాడని, రాష్ట్రపతికి ఈ విషయాన్ని కూడా తెలియజేస్తామని చెప్పిన ఆయన.. ఈ పెయింటింగుల ద్వారా తన క్లయింటు ఎంత సంపాదించాడో తెలియవలసిన అవసరం ఉందన్నారు. మరో దోషి పవన్ సింగ్ తలను మందోలి జైల్లో ‘ రెండుగా చీల్చి ‘ చూశారని సరికొత్త  షాకింగ్ న్యూస్ చెప్పారు.  దీంతో అతడ్ని ఆసుపత్రికి తరలించినట్టు పేర్కొన్నారు. అయితే ఈ డాక్యుమెంట్లు తమకు అందలేదన్నారు.

 

 

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us