వామ్మో.. పెరుగుతున్న వైరస్‌ మరణాలు.. దేశంలో మళ్లీ కరోనా నాటి పరిస్థితులు రాబోతున్నాయా..?

|

Sep 15, 2023 | 11:23 AM

వర్షాకాలం ముగిసిపోయేందుకు రోజులు సమీపిస్తున్న ఈ తరుణంలో డెన్ 2 డెంగ్యూ, స్క్రబ్ టైఫస్ కేసులు కలకలం రేపుతున్నాయి. ఏడిస్ ఈజిప్టీ అనే దోమ కాటు కారణంగా వ్యాపించే డెన్ 2 (డెంగ్యూ) బారిన పడినవారిలో బ్లడ్ ప్లేట్లేట్స్ పడిపోతున్నాయని, శరీరంపై ఎర్రని మచ్చలు ఏర్పడినట్లుగా నోయినాలో గుర్తించారు. మరో వైపు ఓరియెంటా సుత్సుగముషి బ్యాక్టీరియా కాటు ద్వారా వ్యాపించే స్క్రబ్ టైఫస్ బారిన పడి ఒడిశాలో ఐదురుగు, హిమాచల్ ప్రదేశ్ రాజధాని షిమ్లాతో 9 మంది మృతి చెందారు. ఓరియెంటా సుత్సుగముషి..

వామ్మో.. పెరుగుతున్న వైరస్‌ మరణాలు.. దేశంలో మళ్లీ కరోనా నాటి పరిస్థితులు రాబోతున్నాయా..?
Nipah Virus, Dengue Den 2 And Scrub Typhus
Follow us on

కేరళలో నిఫా వైరస్ మరణాలు, కేసులు పెరుగుతున్నాయని దేశం ఆందోళన చెందుతున్న సమయంలోనే డెన్ 2 అనే డెంగ్యూ వేరియంట్‌ను నోయిడాలో, స్క్రబ్ టైఫస్ అనే  కొత్త రకం జ్వరం కేసులను ఓడిశా, హిమాచల్ ప్రదేశ్‌లో గుర్తించారు. మరికొన్ని వారాల్లో వర్షాకాలం ముగిసిపోతున్న ఈ తరుణంలో డెన్ 2 డెంగ్యూ, స్క్రబ్ టైఫస్ కేసులు కలకలం రేపుతున్నాయి. ఏడిస్ ఈజిప్టీ అనే దోమ కాటు కారణంగా వ్యాపించే డెన్ 2 (డెంగ్యూ) బారిన పడినవారిలో బ్లడ్ ప్లేట్లేట్స్ పడిపోతున్నాయని, శరీరంపై ఎర్రని మచ్చలు ఏర్పడినట్లుగా నోయినాలో గుర్తించారు. మరో వైపు ఓరియెంటా సుత్సుగముషి బ్యాక్టీరియా కాటు ద్వారా వ్యాపించే స్క్రబ్ టైఫస్ బారిన పడి ఒడిశాలో ఐదురుగు, హిమాచల్ ప్రదేశ్ రాజధాని షిమ్లాతో 9 మంది మృతి చెందారు. ఓరియెంటా సుత్సుగముషి బ్యాక్టీరియా గడ్డి, పొదల్లో ఇంకా ఎలుకలు, కుందేళ్లు, ఉడతల చర్మంపై పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

డెన్ 2 వేరియంట్ బారిన పడిన డెంగ్యూ రోగుల్లో తలనొప్పి, కండరాల నొప్పి, వాంతులు, వికారం, కీళ్ల నొప్పులు, కంటి వెనుక మంట, స్వాలన్ గ్లాండ్స్, దురద లక్షణాలు ఉండగా.. స్క్రబ్ టైఫస్ బారిన పడినవారిలో తీవ్రజ్వరం, చలి, విపరీతమైన తలనొప్పి, దగ్గు జలుబు, ఒళ్లు నొప్పులు, కండరాల నొప్పి, శరీరంపై దురద, ఎర్రని మచ్చలు, కళ్ల మంట, కోమా వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా, కేరళలో నిఫా వైరస్ కారణంగా ఇప్పటికే ఐదుగురు చనిపోగా.. తాజాగా 39 ఏళ్ల మరో వ్యక్తి చనిపోయారు. దీంతో నిఫా మరణాల సంఖ్య ఆరుకు చేరిందని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి విణా జార్జ్ తెలిపారు. అలాగే తప్పనిసరి అయితే అనవసర ప్రయాణాలు చేయవద్దని ప్రజలను కేరళ ప్రభుత్వం కోరింది.


మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..