Nipah Virus: కేరళకు వెళ్లొద్దు.. నిఫా వైరస్‌ అలజడితో పొరుగు రాష్ట్రం హెచ్చరికలు.. 24 గంటలకు పైగా జ్వరం ఉంటే..

|

Jul 24, 2024 | 10:02 PM

కేరళలో నిఫా వైరస్‌ అలజడితో పొరుగున ఉన్న తమిళనాడులో కూడా అలర్ట్‌ ప్రకటించారు. విద్యార్ధులు కేరళలో పర్యటించరాదని ఆదేశాలు జారీ చేశారు. కేరళ నుంచి టూరిస్టులపై ప్రత్యేక నిఘా పెట్టారు. సరిహద్దు జిల్లాల్లో మెడికల్ క్యాంప్‌లను కూడా ఏర్పాటు చేశారు.

Nipah Virus: కేరళకు వెళ్లొద్దు.. నిఫా వైరస్‌ అలజడితో పొరుగు రాష్ట్రం హెచ్చరికలు.. 24 గంటలకు పైగా జ్వరం ఉంటే..
Nipah Virus
Follow us on

కేరళలో నిఫా వైరస్‌ విజృంభించడంతో తమిళనాడులో హైఅలర్ట్‌ కొనసాగుతోంది. సరిహద్దు జిల్లాల్లో అప్రమత్తమయ్యారు అధికారులు. విద్యార్ధులు కేరళకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. తమిళనాడు, కేరళ సరిహద్దు జిల్లాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. నిఫా వైరస్‌ సోకే ప్రమాదం ఉండడంతో కోయంబత్తూర్‌, తిరుపూర్‌, నీలగిరి జిల్లాల్లో అధికారులు మెడికల్‌ క్యాంప్‌లు ఏర్పాటు చేశారు. కేరళ నుంచి వచ్చిన పర్యాటకులపై ప్రత్యేక నిఘా పెట్టారు. నిఫా వైరస్‌ సోకి కేరళ లోని మల్లాపురం జిల్లాలో 14 ఏళ్ల బాలుడు చనిపోయిన ఘటన తీవ్ర కలకలం రేపింది. వైరస్‌ సోకిన గంటల్లోపే అతడు చనిపోయాడు.

దీంతో సరిహద్దు రాష్ట్రాల్లో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ వైరస్ సోకినవారికి కొన్నిసార్లు గుర్తించదగ్గ లక్షణాలు కనిపించవు. కొందరిలో శ్వాస సంబంధిత సమస్యలు కనిపిస్తాయి. మరికొన్ని కేసుల్లో, నిఫా ఇన్‌ఫెక్షన్ ఎన్‌సెఫలైటిస్‌కు దారి తీస్తుంది. ఈ వైరస్ సోకిన వారు మరణించే ప్రమాదం ఎక్కువ. ఎందుకంటే ఈ ఇన్‌ఫెక్షన్‌కు చికిత్స చేసేందుకు ప్రత్యేకంగా మందులు లేదా వ్యాక్సీన్ అందుబాటులో లేదు. వైరస్ లక్షణాలను గుర్తించి, వ్యక్తి కోలుకునేందుకు సహకరించేలా మాత్రమే ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు.

కలుషితమైన ఆహారం, ఈ వ్యాధి సోకిన వ్యక్తితో కాంటాక్ట్ అవ్వడం వల్ల అది వ్యాప్తి చెందుతుంది. 24 గంటల కంటే ఎక్కువ కాలం ఉండే జ్వరాన్ని సీరియస్‌గా తీసుకోవాలని.. సీజనల్ ఇన్ఫెక్షన్ మధ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇది మరింత ప్రమాదకరంగా మారొచ్చని హెచ్చరిస్తున్నారు.

నిఫా మహమ్మారిని నిరోధించేందుకు కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఒక యాక్షన్ ప్లాన్‌ను రూపొందించింది. గత ఏడాది కూడా కేరళలో ఐదు కేసులు నమోదయ్యాయి. తాజాగా వైరస్‌ సోకి చనిపోయిన బాలుడితో కాంటాక్ట్‌ అయిన వారిని ఐసోలేట్‌ చేశారు అధికారులు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..