కూరగాయలు అమ్మారు.. ఉగ్రవాదిని పట్టుకున్నారు

ఉగ్రవాదులను మట్టబెట్టడం కోసం ఎన్ఐఏ అధికారులు సీక్రెట్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనుమానితులుగా ఉన్న వారిని పట్టుకునేందుకు వారు మారు వేషాలు సైతం వేస్తున్నారు. తాజాగా జహిరుల్ షేక్ అనే ఉగ్రవాది కోసం అలాంటి మారు వేషాలే వేసుకున్న ఎన్‌ఐఏ అధికారులు ఎట్టకేలకు అతడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఇండోర్‌లోని బుర్ద్వాన్‌లో 2014లో జరిగిన బాంబు పేలుళ్లలో జహిరుల్ షేక్ కీలక నిందితుడు. అతడిని పట్టుకోవడం కోసం ఎన్‌ఐఏ అధికారులు ఎప్పటి నుంచో గాలింపు చర్యలను […]

కూరగాయలు అమ్మారు.. ఉగ్రవాదిని పట్టుకున్నారు
Follow us

| Edited By:

Updated on: Aug 17, 2019 | 1:10 PM

ఉగ్రవాదులను మట్టబెట్టడం కోసం ఎన్ఐఏ అధికారులు సీక్రెట్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనుమానితులుగా ఉన్న వారిని పట్టుకునేందుకు వారు మారు వేషాలు సైతం వేస్తున్నారు. తాజాగా జహిరుల్ షేక్ అనే ఉగ్రవాది కోసం అలాంటి మారు వేషాలే వేసుకున్న ఎన్‌ఐఏ అధికారులు ఎట్టకేలకు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

కాగా ఇండోర్‌లోని బుర్ద్వాన్‌లో 2014లో జరిగిన బాంబు పేలుళ్లలో జహిరుల్ షేక్ కీలక నిందితుడు. అతడిని పట్టుకోవడం కోసం ఎన్‌ఐఏ అధికారులు ఎప్పటి నుంచో గాలింపు చర్యలను చేపట్టారు. అయితే ఇటీవల అతడు స్థానిక కోహినూర్ కాలనీలో నివాసం ఉన్నాడని వారికి సమాచారం అందింది. దీంతో వారు స్థానిక పోలీసులకు కూడా తెలీయకుండా సీక్రెట్ ఆపరేషన్ ప్రారంభించేశారు. ఈ క్రమంలో స్వాతంత్ర్య దినోత్సవంకు రెండు రోజుల ముందు అతడిని పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు.

కాగా ఈ ఆపరేషన్ చేసే సమయంలో తమ అధికారులు కూరగాయలు కూడా అమ్మారని ఎన్‌ఐఏ తెలిపింది. ‘‘అజాద్ నగర్ పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు సహాయం చేశారు. అతడికి ఆశ్రయం ఇచ్చిన భూస్వామి వివరాలు ఇంకా తెలియరాలేదు’’ అని అడిషనల్ డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వరుణ్ కపూర్ తెలిపారు.

కాగా బంగ్లాదేశ్‌ ఉగ్ర సంస్థ జమాత్ ఉల్ ముజాహుదీన్‌‌లో జహిరుల్ షేక్ కీలక నేతగా వ్యవహరించాడు. ఈ క్రమంలో బుర్ద్వాన్ బాంబు పేలుళ్లతో పలు ప్రదేశాలకు అతడు బాంబులను సరఫరా చేసినట్లు అనుమానాలు ఉన్నాయి. ఇక పేలుళ్ల తరువాత తప్పించుకున్న జహిరుల్.. రెండు సంవత్సరాలుగా పలు ప్రాంతాల్లో పెయింటర్‌, కూలీగా పనిచేశాడు.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?