AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సుశాంత్ కేసుపై మురళీధర్ రావు వరుస ట్వీట్లు

రోజుకో సంచలనం రేకెత్తిస్తోన్న బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసుకు సంబంధించి బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి పి మురళీధర్ రావు వరుస ట్వీట్లు చేశారు.

సుశాంత్ కేసుపై మురళీధర్ రావు వరుస ట్వీట్లు
Anil kumar poka
|

Updated on: Aug 28, 2020 | 1:52 PM

Share

రోజుకో సంచలనం రేకెత్తిస్తోన్న బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసుకు సంబంధించి బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి పి మురళీధర్ రావు వరుస ట్వీట్లు చేశారు. భారతదేశ ప్రజలు ఈ కేసును ఆసక్తిగా గమనిస్తున్నారన్న ఆయన.. ఈ కేసు చుట్టూ అనేక అనుబంధకేసులు పుట్టుకొస్తుండటంతో సుశాంత్ సూసైడ్ కేసు పరిధి బాగా పెరిగిపోయిందన్నారు. దీంతో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉందన్నారు. సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడటం, హఠాన్మరణం గురించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) దర్యాప్తు చేస్తోంది.. మనీలాండరింగ్ మీద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) దర్యాప్తు చేస్తోంది. ఫలితంగా కేసు మరింత పెద్దదవుతూ వేర్వేరు కేసులను కనెక్ట్ చేస్తుందని మురళీధర్ రావు అభిప్రాయపడ్డారు. అసలేంజరుగుతుందోనని యావత్ భారతదేశం ఆసక్తిగా చూస్తోందని.. ఈ కేసుకు సంబంధించి ఎవరైతే సహాయసహకారాలు అందిస్తున్నారో వాళ్లంతా కేవలం సుశాంత్ కు న్యాయం చేయాలన్న తలంపే కాకుండా క్లీన్ బాలీవుడ్ మూమెంట్ కు సహకరిస్తున్నారని మురళీధర్ రావు వ్యాఖ్యానించారు.

Follow Us