AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRB రైల్వేలో 1215 స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతో దరఖాస్తు చేసుకోండి!

రైల్వేలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (RRB) 1215 స్టేషన్ మాస్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు సమాచారం. డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, పరీక్ష విధానం, ఫీజు వివరాలను ఈ కింద తెలుసుకుని అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు..

RRB రైల్వేలో 1215 స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతో దరఖాస్తు చేసుకోండి!
RRB Station Master Recruitment
Srilakshmi C
|

Updated on: Oct 27, 2026 | 8:43 PM

Share

రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు RRB మరో శుభవార్త అందించింది. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (RRBs) దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న స్టేషన్ మాస్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశాయి. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబరు 27 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 1215 స్టేషన్‌ మాస్టర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఆర్‌ఆర్‌బీ రైల్వేలో స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 2026 నవంబరు 25 నాటికి నిర్దేశిత విద్యార్హత కలిగి ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కారు. అలాగే వయోపరిమితి కింద.. అభ్యర్థుల వయస్సు 2027 జనవరి 1 నాటికి 20 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఓబీసీ (నాన్‌ క్రీమీలేయర్) అభ్యర్ధులకు 3 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, మాజీ సైనికులు, ఇతర అర్హులైన వర్గాలకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 25, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ తదితర అభ్యర్థులు రూ.500, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ట్రాన్స్‌జెండర్‌, మాజీ సైనికులు, మైనారిటీలు, ఈబీసీ అభ్యర్థులు రూ.250 చొప్పున ఫీజు చెల్లించాలి. స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.35,400 ప్రాథమిక వేతనం అందుతుంది. దీనికి అదనంగా నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు చెల్లిస్తారు. శిక్షణ సమయంలో నిర్ణీత స్టైపెండ్ అందిస్తారు.

ఎంపిక విధానం ఇలా..

స్టేషన్ మాస్టర్ పోస్టులకు అభ్యర్థులను పలు దశల్లో ఎంపిక చేస్తారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్ (CBAT), ధ్రువపత్రాల పరిశీలన (Document Verification), వైద్య పరీక్ష (Medical Examination).. దశల్లో ఎంపిక ఉంటుంది. CBT పరీక్షలో ప్రతి తప్పు సమాధానానికి సంబంధిత ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో మూడో వంతు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు పరీక్షకు సిద్ధమయ్యేటప్పుడు జాగ్రత్తగా సమాధానాలు గుర్తించాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు, 100 మార్కులు ఉంటాయి. బేసిక్ సైన్స్, మ్యాథమెటిక్స్, అనలిటికల్ ఎబిలిటీ నుంచి 60 ప్రశ్నలకు 60 మార్కులు, లాజికల్ ఎబిలిటీ నుంచి 20 ప్రశ్నలకు 20 మార్కులు, మెంటల్ రీజనింగ్ 20 ప్రశ్నలకు 20 మార్కులు చొప్పున మొత్తం 100 మార్కులకు, 100 ప్రశ్నలు చొప్పున అడుగుతారు. అభ్యర్థులు తమకు అనుకూలమైన భాషలో పరీక్ష రాసే అవకాశం ఉంటుంది. అంటే CBT ప్రశ్నలు ఇంగ్లిష్‌, హిందీ, తెలుగుతో పాటు అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కొంకణి, మలయాళం, మణిపురి, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, ఉర్దూ వంటి ప్రాంతీయ భారతీయ భాషల్లో అందుబాటులో ఉంటాయి. దరఖాస్తు ఫారంలో అందుబాటులో ఉన్న భాషల్లో ఒకదాన్ని పరీక్షా మాధ్యమంగా ఎంచుకోవాలి.

ఆర్‌ఆర్‌బీ రైల్వేలో స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us