జమ్మూకాశ్మీర్, లదాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజిస్తూ ఆర్టికల్ 370 రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. శివసేన హర్షం వ్యక్తంచేసింది. ఆపార్టీ ఎంపీ సంజయ్ రౌత్ రాజ్యసభలో మాట్లాడుతూ తమపార్టీ వ్యవస్ధాపకుడు బాల్ థాక్రే, వాజ్ పేయీ కల సాకారమైందన్నారు. ఇంతకాలానికి జమ్మూకాశ్మీర్ పూర్తిగా భారత్‌లో అంతర్భాగమైందని…ఇక బలూచిస్థాన్, పీవోకే నెక్ట్స్ టార్గెట్ అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. పాక్ చెరనుంచి తమకు విముక్తి కల్పించాలని, బెలుచిస్తాన్ ప్రజలు ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నారు. ఇదే విషయంపై బెలూచీలు భారత్ సహకారాన్ని కూడా కోరారు. పాక్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపై అంతర్జాతీయ వేదికగా ఎన్నోసార్లు డిమాండ్ చేశారు.
తాజాగా జమ్ము కశ్మీర్ అంశంలో ఆర్టికల్ 370 రద్దుచేసిన ఈ సమయంలో బలూచిస్థాన్‌పై సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు దేశరాజకీయాల్లో సంచలనంగా మారాయి. బీజేపీ నిజంగా బెలుచిస్తాన్ విషయంలో స్పీడు పెంచుతుందా? లేదా అనేది భవిష్యత్తులో తేలనుంది.