News9 Global Summit: TV9 నెట్‌వర్క్ ఆధ్వర్యంలో భారత్‌-జర్మనీ గ్లోబల్‌ సమ్మిట్‌.. కీలక ప్రసంగం చేయనున్న ప్రధాని మోదీ..

| Edited By: TV9 Telugu

Nov 20, 2024 | 5:49 PM

భారతదేశంలోని నంబర్ వన్ న్యూస్ నెట్‌వర్క్ TV9 వార్తలతోపాటు.. విభిన్నమైన కార్యక్రమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.. దీంతోపాటు దేశ, ప్రపంచ రాజకీయ చైతన్యానికి కేంద్ర బిందువుగా మారుతోంది. ఇప్పటికే.. భారతదేశం ఏం కురుకుంటోంది -వాట్ ఇండియా థింక్స్ టుడే లాంటి కార్యక్రమాలతో అందరికీ మరింత చేరువైంది.

News9 Global Summit: TV9 నెట్‌వర్క్ ఆధ్వర్యంలో భారత్‌-జర్మనీ గ్లోబల్‌ సమ్మిట్‌.. కీలక ప్రసంగం చేయనున్న ప్రధాని మోదీ..
News9 Global Summit
Follow us on

భారతదేశంలోని నంబర్ వన్ న్యూస్ నెట్‌వర్క్ TV9 వార్తలతోపాటు.. విభిన్నమైన కార్యక్రమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.. దీంతోపాటు దేశ, ప్రపంచ రాజకీయ చైతన్యానికి కేంద్ర బిందువుగా మారుతోంది. ఇప్పటికే.. భారతదేశం ఏం కోరుకుంటోంది -వాట్ ఇండియా థింక్స్ టుడే లాంటి కార్యక్రమాలతో అందరికీ మరింత చేరువైంది. ప్రజలు ఏం కోరుకుంటున్నారు.. నాయకులు ఏం చేయాలి, అభివృద్ధి తదితర అంశాలపై కీలక చర్చ నిర్వహించింది.. ఇంకా దేశంలో ఫుట్ బాల్ క్రీడను బలంగా మార్చేందుకు టైగర్స్ అండ్ టైగ్రెస్ హంట్ ను ప్రారంభించింది. దీంతో భారత్‌లో ఫుట్‌బాల్‌ క్రీడకు TV9 గ్రూప్‌ ప్రోత్సాహం అందిస్తోంది..

ఇలా.. వార్తలను ప్రసారం చేయడంతోపాటు.. విభిన్నమైన అంశాలను ప్రజల్లోకి తీసుకెళుతోంది టీవీ9 నెట్ వర్క్.. ఇప్పటికే.. పలు కాన్‌క్లేవ్ లను నిర్వహించిన టీవీ9 నెట్ వర్క్ మరో.. కీలక సమ్మిట్ నిర్వహించేందుకు సమాయత్తమవుతోంది.. TV9 గ్రూప్‌కు చెందిన న్యూస్‌ 9 ఆధ్వర్యంలో త్వరలో భారత్‌-జర్మనీ గ్లోబల్‌ సమ్మిట్‌ జరగనుంది.. ఈ సమ్మిట్‌లో ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేయనున్నారు. TV9 నెట్‌వర్క్‌ ఎండీ బరుణ్‌దాస్‌ అధ్యక్షతన భారత్‌-జర్మనీ గ్లోబల్‌ సమ్మిట్‌ జరగనుంది. రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాల బలోపేతమే లక్ష్యంగా టీవీ9 నెట్ వర్క్ ఈ కాన్‌క్లేవ్ ను నిర్వహిస్తోంది..

న్యూస్ 9 ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భారత్‌-జర్మనీ గ్లోబల్‌ సమ్మిట్‌ నవంబర్ 21 నుంచి 23 వరకు జరగనుంది. ఇండియా – జర్మనీ సుస్థిర అభివృద్ధి కోసం ఈ సమ్మిట్ ను నిర్వహిస్తోంది.. ఈ శిఖరాగ్ర సమావేశంలో పలు అంశాలపై, విషయాలపై సుధీర్ఘ చర్చలు జరగనున్నాయి.. భారత్, జర్మనీ బంధం, దౌత్య సంబంధాలు, నూతన ఆవిష్కరణలు, ఉద్యోగ -ఉపాధి, కొత్త కొత్త ఆలోచనలు రేకెత్తించేలా టీవీ9 సమ్మిట్ జరగనుంది.

టీవీ9 గ్లోబల్ సమ్మిట్ జర్మనీలోని స్టుట్‌గార్ట్ ఎంహెచ్‌పీ అరేనా స్టేడియంలో నవంబర్ 21న సాయంత్రం 4 గంటలకు ప్రారంభంకానుంది. రెండోరోజు ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ప్రపంచంలో భారత్ ఏ విధంగా అగ్రస్థానంలో నిలుస్తుందన్న దానిపై కీలక ప్రసంగం చేస్తారు.. ముందుగా TV9 నెట్‌వర్క్‌ ఎండీ బరున్ దాస్‌ ఆయనకు స్వాగతం పలుకుతారు.

భారత్, జర్మనీ గ్లోబల్ సమ్మిట్ లో మీరు కూడా భాగస్వామ్యం కావొచ్చు.. దాని కోసం Email: News9GlobalSummitGermany@TV9.com.. కు మెయిల్ చేయండి..

రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాల బలోపేతమే లక్ష్యంగా టీవీ9 నెట్ వర్క్ నిర్వహిస్తున్న ఈ కాన్‌క్లేవ్ లో పలువురు వ్యాపార, రాజకీయ ప్రముఖులు, కేంద్రమంత్రులు, ఇండియా జర్మనీ ప్రతినిధులు పాల్గొననున్నారు. ఈ మూడు రోజుల సదస్సులో చర్చలతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరగనున్నాయి.

బరున్ దాస్ కీలక వ్యాఖ్యలు..

భారత్‌-జర్మనీ గ్లోబల్‌ సమ్మిట్‌ సమ్మిట్‌ ప్రారంభోత్సవానికి TV9 నెట్‌వర్క్‌ ఎండీ బరుణ్‌దాస్‌ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల అభివృద్ధి లక్ష్యంగా ఈ సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. బెంజ్‌ కారు స్టుట్‌గార్ట్‌ లోనే తయారవుతోందని.. స్టుట్‌గార్ట్‌ నగరం ఫుట్‌బాల్‌కు చాలా ప్రసిద్ధి అంటూ బరుణ్‌దాస్‌ గుర్తుచేశారు. భారత్‌లో ఫుట్‌బాల్‌ క్రీడకు TV9 గ్రూప్‌ ప్రోత్సాహం అందిస్తుందన్నారు.

వీడియో చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..