ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. గదిలోకెళ్లిన అరగంటకే ఊహించని సీన్.. ఒక్కసారిగా అరుపులతో..

|

Aug 08, 2024 | 9:37 AM

పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు.. కానీ నేటి సమాజంలో పెళ్లంటే మూన్నాళ్ల ముచ్చటగా మారిపోయింది.. కొన్ని జంటలు పెళ్లైన కొంతకాలానికే విడిపోతున్నారు.. అయితే.. ఈ జంట మాత్రం పెళ్లైన రోజే షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు.. ప్రేమించుకున్నారు.. కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో వివాహ వేడుక ఘనంగా జరిగింది.

ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. గదిలోకెళ్లిన అరగంటకే ఊహించని సీన్.. ఒక్కసారిగా అరుపులతో..
Crime News
Follow us on

పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు.. కానీ నేటి సమాజంలో పెళ్లంటే మూన్నాళ్ల ముచ్చటగా మారిపోయింది.. కొన్ని జంటలు పెళ్లైన కొంతకాలానికే విడిపోతున్నారు.. అయితే.. ఈ జంట మాత్రం పెళ్లైన రోజే షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు.. ప్రేమించుకున్నారు.. కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో వివాహ వేడుక ఘనంగా జరిగింది.. ఉదయం పెళ్లి చేసుకున్న ఈ జంట మధ్యాహ్నానికి ఒకరినొకరు కత్తులతో పొడుచుకున్నారు. ఆ తర్వాత పెళ్లైన 24 గంటల్లో నూతన వధూవరులు మృతి చెందారు. ఈ దారుణ ఘటన కర్నాటక కోలార్ జిల్లాలో జరిగింది.

కోలార్ జిల్లా కేజీఎఫ్ తాలూకా చంబరసనహళ్లిలో చోటుచేసుకున్న ఈ ఘటన సంచలనంగా మారింది. పెళ్లి కూతురు లిఖితశ్రీ స్వస్థలం ఆంధ్రప్రదేశ్ బైనపల్లి, పెళ్లి కొడుకు సొంతూరు చంబరసనహళ్లి.. నవీన్, లిఖితశ్రీ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెద్దల సమక్షంలో నిన్న ఉదయం పెళ్లి చేసుకున్నారు.

పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. బంధుమిత్రులంతా వచ్చి ఆశీర్వదించారు. సంప్రదాయబద్ధంగా పెళ్లి జరిగింది. రూంలోకి వెళ్లిన ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు.. ఎందుకంత కోపోద్రేకానికి లోనయ్యారో తెలియదు..

ఒకరినొకరు కత్తులతో పొడుచుకున్నారు. రక్తపు మడుగులో ఇద్దరు పడి ఉండగా.. చూసిన కుటుంబసభ్యులు ఒక్కసారిగా షాకయ్యారు.. అనంతరం హుటాహుటిన ఇద్దరినీ కేజీఎఫ్ హాస్పిటల్కు తరలించారు.

కానీ, ఇద్దరూ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అటు కర్ణాటక.. ఇటు ఆంధ్రప్రదేశ్ లో చర్చనీయాంశంగా మారింది.. ఈ ఘటన గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..