
దేశ భద్రత, రక్షణ దృష్ట్యా చైనాకు చెందిన 59 యాప్‌లను భారత్‌లో నిషేధిస్తూ కేంద్ర ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ డిపార్ట్‌మెంట్ సోమవారం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భారతీయులు విరివిగా వినియోగించే టిక్‌టాక్, షేర్‌ఇట్, యూసీ బ్రౌజర్ సహా పలు యాప్‌లు ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే ఈ యాప్‌లన్నీ గూగుల్ ప్లే స్టోర్‌లో కూడా తొలగించబడ్డాయి. ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై చాలా మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. చైనాకు ఇది చెంపపెట్టు లాంటిదని తమ అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ యాప్‌లతో పాటు పబ్‌జిని కూడా బ్యాన్ చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. పబ్‌జినీ మొబైల్ ఫ్లాట్‌ఫాంకు తెచ్చేందుకు చైనాకు చెందిన ఓ కంపెనీ సాయం చేసిందని.. అందుకే ఈ గేమ్‌ను కూడా నిషేధించాలంటూ పలువురు ట్వీట్లు పెడుతున్నారు. అంతేకాదు ఈ ఆటకు బానిసైన వారు దారుణాలకు ఒడిగట్టారని వారు గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మోదీ, అమిత్ షా సహా పలువురు అకౌంట్లకు ట్యాగ్ చేస్తూ పబ్‌జిని బ్యాన్ చేయాలని కోరుతున్నారు. ఈ క్రమంలో ట్విట్టర్‌లో pubgban అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. కాగా చైనా యాప్‌ల బ్యాన్ తరువాత అదే తరహాలో ఉండే భారత్ యాప్‌లకు డిమాండ్ పెరుగుతోంది. టిక్‌టాక్‌ని వాడే చాలా మంది ఇప్పుడు చించోరి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని తమ టాలెంట్‌ను బయటపెడుతున్నారు.