Nepal Bus Accident: నేపాల్‌లో ఘోర ప్రమాదం.. నదిలో పడిపోయిన బస్సు.. 40మంది భారతీయుల గల్లంతు!

|

Aug 23, 2024 | 1:49 PM

నేపాల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. 40 మంది భారతీయులతో వెళ్తున్న బస్సు నదిలో పడిపోయింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

Nepal Bus Accident: నేపాల్‌లో ఘోర ప్రమాదం.. నదిలో పడిపోయిన బస్సు.. 40మంది భారతీయుల గల్లంతు!
Nepal Bus Accident
Follow us on

నేపాల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. 40 మంది భారతీయులతో వెళ్తున్న బస్సు నదిలో పడిపోయింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు చాలా మంది మృతి చెందే అవకాశం ఉందని తెలుస్తోంది. నేపాల్ పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 40 మంది భారతీయ ప్రయాణీకులతో వెళ్తున్న బస్సు తనహున్ జిల్లాలో మర్స్యంగ్డి నదిలో పడిపోయింది. బస్సు పోఖారా నుంచి ఖాట్మండుకు వెళ్తోంది. జిల్లా పోలీసు కార్యాలయం తనహున్ డీఎస్పీ దీప్‌కుమార్ రాయ ఈ విషయాన్ని ధృవీకరించారు. యూపీ ఎఫ్‌టీ 7623 నంబర్ ప్లేట్ ఉన్న బస్సు నదిలో పడిపోయిందని ఆయన చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పొఖ్రా నుంచి ఖాట్మాండు వెళ్తుండగా బస్సు నదిలో పడిపోయింది.  వర్షాల కారణంగా సహాయకచర్యలకు ఆటంకం కలుగుతున్నట్లు స్థానిక అధికారులు  చెబుతున్నారు.

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ట్రావెల్స్‌ బస్సు శుక్రవారం(ఆగస్ట్ 23) ఉదయం నేపాల్‌లోని పొఖారా నుంచి ఖాట్మండుకు బయలుదేరింది. కొండల ప్రాంతంలో అదుపుతప్పిన బస్సు మర్స్యాంగ్డి నదిలో పడిపోయింది. సమాచార అందుకుకున్న అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఆర్మీ, రెస్క్యూ బృందాలను రంగంలో దింపారు. వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రయాణికుల్లో ఇప్పటివరకు 16 మందిని కాపాడగా.. మరో 14 మంది మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ రిలీఫ్‌ కమిషనర్‌ స్పందించారు. స్థానిక అధికారులతో మాట్లాడి సమాచారం తెలుసుకుంటున్నట్లు వెల్లడించారు.

భారీ వర్షాల కారణంగా నది ఉధృతంగా ప్రవహిస్తోందని పలువురు వ్యక్తులు గల్లంతయ్యారని, కొంత మందిని రక్షించారని అధికారులు తెలిపారు. బస్సులో 40 మంది ఉండగా, వారిలో కొందరిని రక్షించారు. అయితే ఇంకా చాలా మంది తప్పిపోయారని తెలిపారు. ఈ ప్రమాదం తనహున్ జిల్లాలో జరిగినట్లు నేపాల్ పోలీసులు తెలిపారు. బస్సు ఉత్తరప్రదేశ్‌కు చెందినది. అయితే బస్సులో ప్రయాణిస్తున్న వారు ఉత్తరప్రదేశ్‌లోని ఏ జిల్లా నుంచి నేపాల్‌కు వెళ్లారనే సమాచారం ఇంకా అందలేదు. అదే సమయంలో, నేపాల్‌లో జరిగిన సంఘటనకు సంబంధించి, బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తులు ఎక్కడి నుండి వచ్చారో తెలుసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఉత్తరప్రదేశ్ రిలీఫ్ కమిషనర్ తెలిపారు. ఇందుకోసం సంప్రదింపులు జరుపుతున్నారు.+

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..