NEET 2021 Date: మెడికల్ విద్యార్ధులకు ముఖ్య గమనిక.. నీట్-2021 పరీక్ష తేదీ ఖరారు..

|

Mar 13, 2021 | 6:54 AM

NEET 2021: విద్యార్ధులకు ముఖ్య గమనిక. అండర్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఎన్‌ఈఈటీ-నీట్‌)...

NEET 2021 Date: మెడికల్ విద్యార్ధులకు ముఖ్య గమనిక.. నీట్-2021 పరీక్ష తేదీ ఖరారు..
Neet
Follow us on

NEET 2021: విద్యార్ధులకు ముఖ్య గమనిక. అండర్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఎన్‌ఈఈటీ-నీట్‌) 2021 పరీక్షను ఆగస్టు 1వ తేదీన నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆయా కోర్సులకు సంబంధించిన నియంత్రణ సంస్థలు రూపొందించిన నియమ నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, బీఏఎంఎస్‌, బీ యూఎంఎస్‌ కోర్సులలో ప్రవేశాలకు ఎన్‌టీఏ నీట్‌-2021 నిర్వహించనున్నారు.

హిందీ, ఇంగ్లీషుతోపాటు 11 భాషలలో పెన్‌, పేపర్‌ విధానంలో ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ ఒక అధికారిక నోటిఫికేషన్‌లో తెలిపింది. కాగా, పరీక్షకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ఎన్‌టీఏనీట్ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని తెలిపారు. నీట్ పరీక్షకు ప్రిపేర్ అయ్యే విద్యార్ధులు nta.ac.in, ntaneet.nic.in వెబ్‌సైట్లను సందర్శించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) సూచించింది.

ఇదిలా ఉంటే కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని గతేడాది సెప్టెంబర్ 13వ తేదీన నీట్-2020 నిర్వహించారు. ఈ పరీక్షకు దాదాపుగా 13.66 లక్షల మంది అభ్యర్ధులు హాజరయ్యారు. ఇందులో 7,71,500 మంది విద్యార్థులు పరీక్షకు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. అటు 2021 సంవత్సరానికి నీట్ సిలబస్ మారదని ఎన్‌టీఏ అంతకముందే ప్రకటించింది.

మరిన్ని ఇక్కడ చదవండి:

Viral Video: భయంతో పరుగెత్తిన జింక.. వేటాడి.. వెంటాడి.. మట్టుబెట్టిన మొసలి.. థ్రిల్లింగ్ వీడియో వైరల్.!

కన్న కొడుకు కోసం తండ్రి పోరాటం.. మొసలి పొట్ట కోసి బాలుడిని బయటికి తీశాడు.. కానీ.!

కోతిని అమాంతం మింగేసిన రాకాసి బల్లి.! ఒళ్లుగగుర్పొడిచే వీడియో.. నెట్టింట్లో వైరల్.!