Sanjay Raut: ఆ విషయంలో కూడా ఈడీ ఇలానే దర్యాప్తు చేస్తుందా.. ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు.. 

|

Feb 15, 2022 | 5:35 PM

ED Raids in Mumbai: ముంబైలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు జాతీయ భద్రతతో ముడిపడి ఉంటే.. మహారాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థకు సహకరించాల్సిన అవసరం ఉందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పేర్కొన్నారు.

Sanjay Raut: ఆ విషయంలో కూడా ఈడీ ఇలానే దర్యాప్తు చేస్తుందా.. ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు.. 
Sanjay Raut
Follow us on

ED Raids in Mumbai: ముంబైలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు జాతీయ భద్రతతో ముడిపడి ఉంటే.. మహారాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థకు సహకరించాల్సిన అవసరం ఉందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పేర్కొన్నారు. అయితే, గుజరాత్‌లో జరిగిన అతిపెద్ద బ్యాంకు మోసంపై కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ పరిశీలిస్తుందా అని శివసేన ప్రతినిధి (MP Sanjay Raut) రౌత్ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. అండర్ వరల్డ్ కార్యకలాపాలు, అక్రమ ఆస్తుల లావాదేవీలు, హవాలా లావాదేవీలకు సంబంధించిన మనీలాండరింగ్ విచారణలో భాగంగా ఈడీ (ED) మంగళవారం ముంబైలో పలుమార్లు సోదాలు నిర్వహించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి, పరారీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీంపై ఇటీవల నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్, మాజీ ఏజెన్సీకి అందిన కొన్ని స్వతంత్ర ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌ల ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

దీనిపై సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. దేశ భద్రతకు సంబంధించిన ఏదైనా ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సంస్థలతో సహకరించడం అవసరం. దీనిపై కేంద్రం, రాష్ట్రం కలిసి పనిచేయడం అవసరం అని రైత్ పేర్కొన్నారు. జాతీయ, అంతర్గత భద్రత అనేది చాలా సున్నితమైన సమస్య. ఈ విచారణపై మాట్లాడటం సరికాదంటూ ఎంపీ అన్నారు. భద్రతకు సంబంధించిన ఇన్‌పుట్‌లతో ఈడీ విచారణను నిర్వహిస్తుంటే, దానిని స్వాగతించాలి. ఇది దేశం కోసం తప్ప ఏ రాజకీయ పార్టీ కోసం కాదు.. అని వ్యాఖ్యానించారు. అయితే.. మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో దాదాపు 10 స్థానాల్లో ED అధికారులు దాడులు నిర్వహించారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) సెక్షన్ల కింద ఈ చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) ఇటీవల దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్, మాజీ ఏజెన్సీకి అందిన కొన్ని ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌ల ఆధారంగా ED ఈ చర్యలు తీసుకుంటుందని పేర్కొంటున్నారు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియంను రూ. 22,842 కోట్లకు పైగా మోసం చేశారన్న ఆరోపణలపై సీబీఐ ఏబీజీ షిప్‌యార్డ్ లిమిటెడ్, దాని మాజీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రిషి కమలేష్ అగర్వాల్‌తో పాటు ఇతరులపై కేసు నమోదు చేశారు. దీనిపై రౌత్ స్పందిస్తూ.. దేశంలో అతిపెద్ద బ్యాంక్ మోసంలో ED ఏమి చేస్తుందో మేము కూడా చూడాలనుకుంటున్నాము. గత రెండేళ్లుగా జరిగిన మోసాన్ని అణిచివేసేందుకు ప్రయత్నించిన వ్యక్తులు ఎవరు, ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు కూడా అనుమతించలేదు. కుట్రదారులు దేశం నుంచి ఎలా తప్పించుకున్నారంటూ ప్రశ్నలు సంధించారు.

ఇదిలాఉంటే.. సంజయ్ రౌత్.. సోమవారం పలు కీలక వ్యా్ఖ్యలు చేశారు. తమ పార్టీని సెంట్రల్ ఏజెన్సీలను ఉపయోగించి బెదిరించవద్దని.. రాబోయే కొద్ది రోజుల్లో బీజేపీ చెందిన కీలక నాయకులు కటకటాల వెనుక ఉంటారని హెచ్చరించారు. గత ఏడాది నవంబర్‌లో మనీలాండరింగ్ కేసులో ఇడి అరెస్టు చేసిన మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ త్వరలో జైలు నుంచి బయటకు వస్తారని కూడా రౌత్ పేర్కొన్నారు.

Also Read:

CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్‌‌పై కేసు నమోదు చేయనున్న అస్సాం పోలీసులు.. మరింత ముదురుతున్న వివాదం..

CM KCR: మతతత్వ శక్తులపై పోరాటం కొనసాగించాల్సిందే.. సీఎం కేసీఆర్‌ను అభినందించిన మాజీ ప్రధాని దేవెగౌడ..