సుశాంత్ కేసు.. మరో ఆరుగురిని అరెస్ట్‌ చేసిన ఎన్సీబీ

| Edited By:

Sep 14, 2020 | 12:13 PM

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ కేసులో డ్రగ్స్ కోణంలో మరో ఆరుగురిని నార్కొటిక్స్‌ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అరెస్ట్ చేసింది

సుశాంత్ కేసు.. మరో ఆరుగురిని అరెస్ట్‌ చేసిన ఎన్సీబీ
Follow us on

Sushant Case updates: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ కేసులో డ్రగ్స్ కోణంలో మరో ఆరుగురిని నార్కొటిక్స్‌ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అరెస్ట్ చేసింది. ముంబయికి చెందిన కరమ్‌జీత్ సింగ్ ఆనంద్, డ్వేన్ పెర్నాండెజ్‌, సంకేత్ పటేల్‌, అంకుష్ అన్రేజా, పందీప్ గుప్తా, అఫ్‌లాబ్ ఫతే అన్సారీని ఎన్సీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ సరఫరాలో ఈ ఆరుగురు భాగం పంచుకున్నట్లు విచారణలో తేలింది. దీంతో ఈ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య 16కు చేరింది.

డ్రగ్ డీలర్‌గా పనిచేసే ఫెర్నాండెజ్‌ రియా సోదరుడు షోవిక్‌కి సహాయకుడిగా ఉండేవాడు. ఆనంద్ అనే డ్రగ్ డీలర్ దగ్గర పనిచేసే సంకేత్ పటేల్.. సెలబ్రిటీలకు మత్తుపదార్థాలు సరఫరా చేసేవాడు. ఇక గతంలో రిక్షా డ్రైవర్‌గా పనిచేసిన సందీప్ గుప్తా డ్రగ్ డీలర్లకు గంజాయిని సరఫరా చేసేవాడు. గుప్తా వద్ద అన్సారీ సహాయకుడిగా పనిచేసేవాడు. వీరిందరిని అదుపులోకి తీసుకున్న ఎన్సీబీ విచారణను ప్రారంభించింది. ఇదిలా ఉంటే ఈ కేసులో ఇప్పటికే నటి రియా, ఆమె సోదరుడు షోవిక్ సహా 10 మంది అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న విషయం తెలిసిందే.

Read More:

‘యాత్ర’ దర్శకుడితో నాగార్జున మూవీ..!

చిత్తూరు ఎంపీ రెడ్డప్పకు కరోనా