NBFID Jobs 2023: రాత పరీక్ష లేకుండా కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. ఈ అర్హతలుంటే చాలు..

|

Jun 11, 2023 | 8:59 PM

నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ ఫైనాన్సింగ్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఎన్‌బీఎఫ్‌ఐడీ).. హెడ్‌, చీఫ్‌ కంప్లియెన్స్‌ ఆఫీసర్‌, ఇంటర్నల్‌ ఆడిటర్‌, చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌, రిస్క్‌ మేనేజ్‌మెంట్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..

NBFID Jobs 2023: రాత పరీక్ష లేకుండా కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. ఈ అర్హతలుంటే చాలు..
NBFID
Follow us on

నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ ఫైనాన్సింగ్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఎన్‌బీఎఫ్‌ఐడీ).. హెడ్‌, చీఫ్‌ కంప్లియెన్స్‌ ఆఫీసర్‌, ఇంటర్నల్‌ ఆడిటర్‌, చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌, రిస్క్‌ మేనేజ్‌మెంట్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్‌ డిగ్రీ/ సీఏ/ పీజీ డిగ్రీ/ ఎంసీఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పోస్టును బట్టి సంబంధిత పనిలో కనీసం 20 ఏళ్ల పని అనుభవం ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 55 ఏళ్లకు మించకుండా ఉండాలి.

ఈ అర్హతలున్న వారు జూన్‌ 27, 2023వ తేదీ సాయంత్రం 6 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలి. కింది ఈమెయిల్‌ ఐడీకి ముగింపు తేదీలోపు సీవీని పంపించాలి. స్క్రీనింగ్‌, షార్ట్‌లిస్టెడ్‌, అనుభవం ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. అర్హులైన వారికి ఇంటర్వ్యూ కోసం కాల్‌లెటర్‌ పంపిస్తారు. ఆయా పోస్టులకు ఎంపికైన వారు ముంబాయ్‌లో పనిచేయవల్సి ఉంటుంది. ఇతర వివరాలు వివరణాత్మక నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత తెలుసుకోవచ్చు.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.