ఎస్పీ ఎదుట లొంగిపోయిన నక్సల్స్‌ దంపతులు

ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ తుపాకీ వీడి.. జన జీవన స్రవంతిలో కలుస్తున్నారు. పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు సక్సెస్ అవుతున్నాయి. మావోయిస్టులుగా మారిన వారు లొంగిపోతే.. వారిపై ఉన్న కేసులను తొలగిస్తూ..

  • Tv9 Telugu
  • Publish Date - 11:52 am, Thu, 9 July 20
ఎస్పీ ఎదుట లొంగిపోయిన నక్సల్స్‌ దంపతులు

ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ తుపాకీ వీడి.. జన జీవన స్రవంతిలో కలుస్తున్నారు. పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు సక్సెస్ అవుతున్నాయి. మావోయిస్టులుగా మారిన వారు లొంగిపోతే.. వారిపై ఉన్న కేసులను తొలగిస్తూ.. వారికి ఉపాధి కల్పించేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అందుకు స్పెషల్ డ్రైవ్‌ కూడా చేపడుతున్నారు. తాజాగా.. దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ్‌ ఎదుట నక్సల్స్‌ దంపతులు లొంగిపోయారు. వీరిద్దరూ కూడా ఎన్‌ఎండీసీ ప్లాంట్ వద్ద పోలీసులపై జరిపిన దాడిలో ప్రధాన నిందితులుగా ఉన్నారు. ఆ సంఘటనలో ఆరుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. వీరు పోలీసుల షెడ్యూల్స్‌తో పాటు.. ఇతర సమాచారాన్ని ఎప్పటికప్పుడు నక్సల్స్‌కు చేరవేయడంతో కీలక పాత్ర పోషించినట్లు ఎస్పీ పల్లవ్ తెలిపారు. ప్రస్తుతం లొంగిపోయిన ఇద్దరు నక్సల్స్‌తో పాటు.. ఇటీవల 28 మంది కూడా లొంగిపోయారని వివరించారు.