ట్విటర్ లో చైల్డ్ పోర్నోగ్రఫీ కంటెంట్..జాతీయ మహిళా కమిషన్ మండిపాటు.. ఢిల్లీలో కేసు

| Edited By: Phani CH

Jun 30, 2021 | 7:32 PM

ట్విటర్ లో చైల్డ్ పోర్నోగ్రఫీ కంటెంట్ కొనసాగుతుండడంపై జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ మండిపడ్డారు. వారం లోగా దీన్ని తొలగించాలని, లేదా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు.

ట్విటర్ లో చైల్డ్ పోర్నోగ్రఫీ కంటెంట్..జాతీయ మహిళా కమిషన్ మండిపాటు.. ఢిల్లీలో కేసు
Women Commission Fire On Tw
Follow us on

ట్విటర్ లో చైల్డ్ పోర్నోగ్రఫీ కంటెంట్ కొనసాగుతుండడంపై జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ మండిపడ్డారు. వారం లోగా దీన్ని తొలగించాలని, లేదా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు. ట్విటర్ ఇండియా ఎండీకి ఆమె లేఖ రాస్తూ..అసభ్యకరమైన, అశ్లీలమైన కంటెంట్ గానీ సమాచారం గానీ లేకుండా చూడాలని కోరారు. వారంలోగా ఇందుకు చర్యలు తీసుకోండి.. 10 రోజుల్లోగా మీరెలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయండి అని ఆదేశించారు. ట్విటర్ నిర్వాకంపై ఢిల్లీ పోలీసు కమిషనర్ కూడా ఆమె లేఖ రాశారు. ఈ విధమైన ఫిర్యాదులు లోగడ కూడా వచ్చాయని..కానీ ఈ సామాజిక మాధ్యమ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని రేఖా శర్మ అన్నారు. ఇండియాలో దీనిపై బ్యాన్ ఉందని.. ఇది భారతీయ చట్టాల ఉల్లంఘనే అని తెలిసినప్పటికీ ట్విటర్ ఇంకా చైల్డ్ పోర్నోగ్రఫీ కంటెంట్ ని కొనసాగిస్తోందని ఆమె ఆరోపించారు. ఇంత నిర్లక్ష్యమా అని ప్రశ్నించారు.

ఇలా ఉండగా రేఖా శర్మ లేఖను పురస్కరించుకుని ఢిల్లీలో పోలీసులు ట్విటర్ పై పోక్సో, ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే ట్విటర్ ఇండియా ఎండీ మనీష్ మహేశ్వరి పై వివిధ పోలీసు స్టేషన్లలో ఎఫ్ఐఆర్ లు దాఖలయ్యాయి. యూపీలోని ఘజియాబాద్ పోలీసులు ఆయనను వ్యక్తిగతంగా తమ ముందు హాజరు కావాలని నోటీసులు జారీ చేయగా.. వాటిని సవాలు చేస్తూ కర్ణాటక హైకోర్టు కెక్కి తాత్కాలిక ఊరట పొందాడు. ఆ పోలీసుల ముందు వ్యక్తిగతంగా ఈయన హాజరు కానవసరం లేదని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించుకోవచ్చునని కోర్టు పేర్కొంది. పైగా ఇప్పుడే ఆయన యూపీ వెళ్ళవలసిన అవసరం లేదని కూడా తెలిపింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: ‘వెళ్లి చావండి’ .. స్కూల్ ఫీజులపై మొర పెట్టుకోవడానికి వెళ్లిన పేరెంట్స్‌పై విద్యాశాఖ‌ మంత్రి రుస‌రుస‌లు

Anushka Shetty: ఎమోషనల్ మెసేజ్ చేసిన అనుష్క…!! అసలేమైంది…?? ( వీడియో )