Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ 3 గంటలపాటు విచారించింది. మొత్తం 20 ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ఆరోగ్య కారణాలతో ఆమె చేసిన ప్రత్యేక విజ్ఞప్తితో తొలిరోజు విచారణను త్వరగానే ముగించారు. మళ్లీ 25న (సోమవారం) విచారణకు రావాలని సమన్లు జారీ చేశారు. ఐదుగురు అధికారులతో కూడిన ఈడీ బృందం సోనియా గాంధీని విచారించింది. అనంతరం అధికారులు సోనియాను బయటకు పంపించారు. విచారణ ముగుస్తున్న సమయంలో సోనియాకు వారు సమన్లు అందజేశారు. ఇదిలా ఉంటే.. ఈడీ కార్యాలయంలో సోనియాను విచారిస్తున్న సమయంలో ఆమె కూతురు ప్రియాంకా గాంధీ వాద్రా అదే కార్యాలయంలోని వేరే గదిలో వేచి చూశారు. కాంగ్రెస్ పత్రిక నేషనల్ హెరాల్డ్ యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్‌లో మనీలాండరింగ్ జరిగిందన్న ఆరోపణలపై ఇప్పటికే ఈడీ అధికారులు రాహుల్ గాంధీని పలుమార్లు ప్రశ్నించిన విషయం తెలిసిందే.
కాగా.. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీని ఈడీ ప్రశ్నించడంపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడుతోంది. రాజకీయ ప్రతీకారంలో భాగంగానే కేంద్రం.. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు దేశవ్యాప్తంగా నిరసనలకు దిగారు. ఢిల్లీలో నిరసనలు చేపట్టిన సుమారు 75 మంది కాంగ్రెస్ MPలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెద్ద ఎత్తున నిరసనల్లో పాల్గొన్న కాంగ్రెస్కార్యకర్తలను నిలువరించేందుకు పోలీసులు వాటర్ కెనాన్‌లు ప్రయోగించారు. మరోవైపు కాంగ్రెస్పార్టీ ప్రధాన కార్యాలయం ముందు నిరసన చేస్తున్న పలువురు ఎంపీలను నిర్బంధించినట్లు పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి