నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ వర్సెస్ ఈడీ యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశాలు కన్పించడం లేదు. గురువారం ఈడీ విచారణకు హాజరుకావడం లేదని సోనియాగాంధీ తెలిపారు. నేషనల్ హెరాల్డ్ కేసులో హాజరుకావాలని సోనియాకు ఈడీ సమన్లు జారీ చేసింది. అయితే కరోనా నుంచి తాను ఇంకా పూర్తిగా కోలుకోలేదని , అనారోగ్యం కారణంగా విచారణ వాయిదా వేయాలని ఈడీకి సోనియాగాంధీ లేఖ రాశారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అయిన కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకునే వరకు కొన్ని వారాల పాటు తనకు సమయం కావాలని సోనియా గాంధీ డిమాండ్ చేశారు.
ఇదే అంశంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ట్వీట్ చేస్తూ, ‘‘కొవిడ్, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో చికిత్స తీసుకున్న సోనియాను ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దాంతో ఈడీ ముందు హాజరుకు మరికొంత గడువు ఇవ్వాలని దర్యాప్తు సంస్థకు సోనియా లేఖ రాశారు’’ అని వెల్లడించారు.
श्रीमती सोनिया गांधी ने आज ED को पत्र लिखकर उनके पूरी तरह से ठीक होने तक अगले कुछ हफ्तों के लिए उनकी उपस्थिति को स्थगित करने का अनुरोध किया है।
2/2
— Jairam Ramesh (@Jairam_Ramesh) June 22, 2022
అయితే.. 75 ఏళ్ల సోనియా గాంధీ కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ తర్వాత ఆరోగ్య సమస్యల కారణంగా జూన్ 12 న సర్ గంగా రామ్ ఆసుపత్రిలో చేరారు. ఆమెకు కరోనా వైరస్ సోకినట్లు తేలింది. జూన్ 20న ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని ఆసుపత్రి వైద్యులు సూచించారు.
నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జూన్ 23న విచారణకు హాజరు కావాలని సోనియా గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తాజాగా సమన్లు జారీ చేసింది. ఇప్పుడు సోనియా గాంధీ మళ్లీ కొన్ని వారాల సమయం కావాలని ఈడీకి లేఖ రాశారు.
మరోపక్క రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఐదు రోజులపాటు ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో రాహుల్‌ను ఈడీ దాదాపు 50 గంటల పాటు ప్రశ్నించింది.