రాహుల్ గాంధీ ట్వీట్ లో ఆ బాలిక ఫోటో.. ట్విటర్ ఇండియాకు బాలల హక్కుల సంఘం నోటీసు

| Edited By: Phani CH

Aug 04, 2021 | 9:12 PM

ఢిల్లీలో హత్యాచారానికి గురైన తొమ్మిదేళ్ల బాలిక ఫోటోను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన ట్వీట్ లో షేర్ చేసిన విషయాన్ని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘం తీవ్రంగా పరిగణించింది.

రాహుల్ గాంధీ ట్వీట్ లో ఆ బాలిక ఫోటో.. ట్విటర్ ఇండియాకు బాలల హక్కుల సంఘం నోటీసు
National Childrens Commission Notice
Follow us on

ఢిల్లీలో హత్యాచారానికి గురైన తొమ్మిదేళ్ల బాలిక ఫోటోను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన ట్వీట్ లో షేర్ చేసిన విషయాన్ని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘం తీవ్రంగా పరిగణించింది. ఆ ఫోటోను డిలీట్ చేయవలసిందిగా ట్విటర్ ఇండియాకు నోటీసు జారీ చేసింది. ఈ బాలిక కుటుంబాన్ని రాహుల్ పరామర్శించినప్పుడు ఆమె తలిదండ్రుల ముఖాలతో బాటు బాలిక ఫోటోను కూడా అయన ట్వీట్ లో షేర్ చేశారు. ఇది పోక్సో నిబంధనలను అతిక్రమించడమేనని,ముఖ్యంగా రేప్ బాధితురాళ్ల ఫోటోలను, వారి ఐడెంటిటీని ప్రచురితం చేయడం. లేదా బహిర్గతం చేయడం ఈ చట్టాన్ని ఉల్లంఘించడమేనని ఈ కమిషన్ పేర్కొంది. అందువల్ల రాహుల్ గాంధీకి నోటీసు జారీ చేయాలనీ అలాగే ఈ బాలిక ఫోటోను, ఆమె తలిదండ్రుల ఫోటోను కూడా డిలీట్ చేయాలనీ ట్విటర్ ఇండియాకు పంపిన నోటీసులో పేర్కొంది.

బీజేపీ అధికార ప్రతినిధి సాంబిత్ పాత్రా తన మీడియా సమావేశంలో ఇదే విషయాన్నీ ప్రస్తావించిన సంగతి తెలిసిందే.. రాహుల్ చర్య పోక్సో చట్టానికి విరుద్ధమని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. ఇప్పటికే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా ఈ విధమైన ఘటనలు జరుగుతున్నాయని మరి రాహుల్ ఆ యా బాధిత కుటుంబాల వద్దకు వెళ్లి ఎందుకు పరామర్శించరని ఆయన అన్నారు. పోక్సో చట్టం అమలవుతున్నప్పటి నుంచే కాకుండా ఇలా బాధితురాళ్ళ ఫోటోలను ప్రచురించడం లేదా బహిర్గతం చేయడం సరికాదని ప్రభ్జుత్వం కూడా చెబుతూ వచ్చింది. ఇది ఆయా కుటుంబాలను వేధించినట్టే అవుతుందని లోగడే అభిప్రాయపడింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: ‘వామ్మో ! రెండు అడుగుల పొడవైన చికెన్ రోల్’.. ఢిల్లీ స్టాల్ దే దీని క్రెడిట్ ! వీడియో వైరల్

Viral Photos : ప్రపంచంలోని ఈ 5 పురాతన నగరాలను చూశారా..! ఇప్పుడు అవి ఎలా ఉన్నాయంటే..?