National Anti Doping Bill: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ ఉభయ సభల్లో పలు కీలక బిల్లులకు ఆమోదం లభించింది. నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ, నేషనల్ డోపింగ్ టెస్టింగ్ లాబొరేటరీ పనితీరును చట్టబద్ధం చేసే జాతీయ డోపింగ్ నిరోధక బిల్లు 2021ను బుధవారం రాజ్యసభలో ఏకగ్రీవంగా ఆమోదించబడింది. ఈ బిల్లు గత బుధవారమే లోక్‌సభ ఆమోదించింది. డోపింగ్ నిరోధక అంశంపై ఐక్యరాజ్యసమితి ఒప్పందం కూడా ప్రభావితం చేస్తుంది. లోక్‌సభలో బిల్లుపై జరిగిన చర్చపై కేంద్ర యువజన, క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందిస్తూ.. జాతీయ డోపింగ్ నిరోధక బిల్లు క్రీడలకు దోహదపడుతుందని, క్రీడాకారుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని ఆయన అన్నారు.
జాతీయ డోపింగ్ నిరోధక బిల్లు, 2022 ఈరోజు రాజ్యసభలో మూజువాణి ఓటుతో ఆమోదించబడింది. క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిగా అనురాగ్ ఠాకూర్ ప్రవేశపెట్టిన మొదటి బిల్లు ఇదే. ఏదైనా అంతర్జాతీయ ఛాంపియన్‌షిప్‌ను నిర్వహించడానికి అవసరమైన పరీక్షల సంఖ్య నెలకు 10,000 వరకు ఉంటుందని, ప్రస్తుతం భారతదేశంలో సంవత్సరానికి 6వేల పరీక్షలను మాత్రమే నిర్వహిస్తోందని అన్నారు. ప్రతిపాదిత చట్టం పరీక్ష సామర్థ్యాన్ని గణనీయంగా పెంచడంలో సహాయపడుతుందని మంత్రి పేర్కొన్నారు.
Watch LIVE – Reply of Union Minister for Youth Affairs & Sports Sh @ianuragthakur on ‘The National Anti-Doping Bill,2021 debate in Rajya Sabha for consideration and passing.@sansad_tv https://t.co/zLTP31pWa1
— Office of Mr. Anurag Thakur (@Anurag_Office) August 3, 2022
16 దేశాల నమూనాలను భారతదేశంలోని ప్రయోగశాలలలో పరీక్షిస్తున్నట్లు ఠాకూర్ సభకు తెలిపారు. ఈ బిల్లు ఆమోదంతో క్రీడల్లో డోపింగ్‌పై విచారణకు సంబంధించి సొంత చట్టాలను కలిగి ఉన్న అమెరికా, చైనా, జపాన్, ఫ్రాన్స్ వంటి ఎంపిక చేసిన దేశాల క్లబ్‌లో భారత్ చేరుతుందని మంత్రి వెల్లడించారు.
“इस कानून के बनने से दुनिया भर के देशों में और #WADA में ये संदेश स्पष्ट जाएगा कि खेल, खिलाड़ियों और #doping को लेकर भारत बहुत गंभीर है”
– श्री @ianuragthakur राष्ट्रीय डोपिंग रोधी विधेयक 2022 पर #RajyaSabha pic.twitter.com/YpvRX3fZSr
— Office of Mr. Anurag Thakur (@Anurag_Office) August 3, 2022
ఏ ల్యాబొరేటరీ ఏర్పాటుకు 70 నుంచి 100 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారని, అయితే ఇందుకు ఎలాంటి లోటు ఉండదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడూ క్రీడలకు, క్రీడాకారులకు ప్రాధాన్యత ఇస్తారని, ఈ చట్టం అమల్లోకి రావడంతో మన ఆటగాళ్లకు ఎంతో మేలు జరగడంతో పాటు విదేశాలకు ఆటగాళ్ల టెస్ట్ శాంపిల్స్ పంపడంపై ఆధారపడే పరిస్థితి పూర్తిగా తొలగిపోతుందన్నారు.