ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కుమార్తె, ఎంపీ సుప్రియా సులేకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. హింజేవాడిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే చీరకు ప్రమాదవశాత్తూ మంటలు అంటుకున్నాయి. దీపం తగిలి చీరకు మంటలు వ్యాపించగా.. సకాలంలో మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. బారామతి లోక్‌సభ నియోజకవర్గంలోని హింజేవాడిలో కరాటే పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎన్సీపీ ఎంపీ సుప్రియా సులే పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాల వేస్తుండగా.. ప్రమాదవశాత్తు దీపం తగిలి ఆమె చీరకు మంటలు వ్యాపించాయి. అయితే, వెంటనే అప్రమత్తమైన ఎంపీ సుప్రియా సులే స్వయంగా మంటలను ఆర్పివేశారు.
ఈ ఘటన తర్వాత ఎన్సీపీ కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న కార్యకర్తలు సుప్రియా సూలే ఆరోగ్యం గురించి ఆరా తీయడం ప్రారంభించారు. దీంతో సుప్రియా సులే తాను ఆరోగ్యంగా ఉన్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘‘నేను క్షేమంగా ఉన్నాను. ఎవరూ ఆందోళన చెందవద్దు’’ అంటూ సుప్రియా సూలే కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. ‘‘మా శ్రేయోభిలాషులు, పౌరులు, కార్యకర్తలు, అధికారులకు నా విన్నపం ఏమిటంటే.. నేను క్షేమంగా ఉన్నాను.. ఆందోళన చెందవద్దు. మీరు చూపే ప్రేమ, శ్రద్ధ నాకు విలువైనవి. అందరికీ ధన్యవాదాలు’’ అంటూ సుప్రియా సూలే ప్రకటన విడుదల చేశారు.
खासदार @supriya_sule ताई पुण्यात एका कार्यक्रमांमध्ये दीप प्रज्वलन करत असताना त्यांच्या साडीला लागली आग… pic.twitter.com/C6FBQici2A
— Shilpa Bodkhe – प्रा.शिल्पा बोडखे (@BodkheShilpa) January 15, 2023
కాగా, సుప్రియా సూలే ఈరోజు పూణె పర్యటనలో ఉన్నారు. పూణే, బారామతిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బారామతిలోని హింజేవాడిలో శిబారీ ఆఫ్ కరాటే పోటీల ప్రారంభోత్సవం సమయంలో ఈ ఘటన జరిగింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..