హిమాచల్ ప్రదేశ్ లో తృటిలో పెను ప్రమాదం తప్పింది. సిర్మౌర్ జిల్లాలోని షిలాయ్ జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న ప్రైవేటు బస్సు హఠాత్తుగా ఓ లోయలో పడబోయింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి వాహనం కింద పడిపోకుండా ఆపాడు. బస్సులోని 22 మంది ప్రయాణికులను దించివేశాడు. ఆయన ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా ఘోర ప్రమాదం జరిగేదని, తమ ప్రాణాలు గాల్లో కలిసిపోయేవని ప్రయాణికులు పేర్కొన్నారు. ఆ డ్రైవర్ కి కృతజ్ఞతలు తెలిపారు. కొన్ని వారాలుగా హిమాచల్ ను భారీ వర్షాలు, వరదలు కుదిపివేస్తున్నాయి. అనేక చోట్ల కొండ చరియలు విరిగి పడి భారీ ప్రాణ, అఆస్ధి నష్టాన్ని కలిగించాయి. ఇదే జిల్లాలో గతవారం 300 మీటర్ల రోడ్డు పూర్తిగా దెబ్బ తిన్నదని అధికారులు తెలిపారు. ఈ మూడు వారాల్లో ఈ ప్రకృతి బీభత్సం కారణంగా 218 మంది మృతి చెందారని, 12 మంది గల్లంతయ్యారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి మహేందర్ సింగ్ ఠాకూర్ అసెంబ్లీ లో తెలిపారు.
కొండచరియలు విరిగి పడినందున.. పలు జిల్లాల్లో రోడ్లు ధ్వంసమయ్యాయని, వాటర్ పైప్ లైన్స్ దెబ్బ తిన్నాయని ఆయన వెల్లడించారు. దాదాపు రూ. 451.56 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగిందని ఆయన పేర్కొన్నారు. నిరాశ్రయుల పునరావాసం కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందన్నారు. దెబ్బ తిన్న ఇళ్ల మరమ్మతులను యుద్ధ ప్రాతిపదికన చేబడుతున్నట్టు ఆయన చెప్పారు.
మరిన్ని ఇక్కడ చూడండి: పోర్న్ చిత్రాల కేసులో రాజ్ కుంద్రాకు నో రిలీఫ్.. బెయిల్ పిటిషన్ ను తిరస్కరించిన బాంబేహైకోర్టు
Sangareddy: కొత్త కారు బీభత్సం.. చిన్నారులకు తప్పిన ముప్పు.. సీసీటీవీ దృశ్యాలు