Hepatitis Disease: తల్లిదండ్రులకు హెచ్చరిక..! చిన్నారుల్లో భారీగా హెప‌టైటిస్‌ కేసులు: డ‌బ్ల్యూహెచ్‌వో

|

Jul 14, 2022 | 12:16 PM

తీవ్ర‌మైన రీతిలో హెప‌టైటిస్ వ్యాధి సోకిన వారిలో చాలా కేసుల్లో లివ‌ర్ ట్రాన్స్‌ప్లాంటేష‌న్ జ‌రుగుతోంది. అయితే, ఇందులో స‌గం కేసులు

Hepatitis Disease: తల్లిదండ్రులకు హెచ్చరిక..! చిన్నారుల్లో భారీగా హెప‌టైటిస్‌ కేసులు: డ‌బ్ల్యూహెచ్‌వో
Who
Follow us on

Hepatitis Disease: చిన్నారుల్లో హెప‌టైటిస్ వ్యాధి కలకలం రేపుతోంది. ఇప్పటివరకు సుమారు 35 దేశాల్లో దాదాపు వెయ్యికిపైగా హైప‌టైటిస్ కేసులు న‌మోదు అయిన‌ట్లు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ డ‌బ్ల్యూహెచ్‌వో తెలిపింది. ఈ ప‌రిణామాల‌ను సునిశితంగా ప‌రిశీలిస్తున్న‌ట్లు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. తీవ్ర‌మైన రీతిలో హెప‌టైటిస్ వ్యాధి సోకిన వారిలో చాలా కేసుల్లో లివ‌ర్ ట్రాన్స్‌ప్లాంటేష‌న్ జ‌రుగుతోంది. అయితే, ఇందులో స‌గం కేసులు యూరోప్‌లోనే న‌మోదు అయిన‌ట్లు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. హెప‌టైటిస్ వ్యాధి సోకుతున్న‌ట్టు డ‌బ్ల్యూహెచ్‌వో ఏప్రిల్ 5వ తేదీన తొలిసారి గుర్తించిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టి వ‌ర‌కు హెప‌టైటిస్ వ‌ల్ల 22 మంది మృతి చెందారు.

ఈ వైరస్ 1 నుంచి 5 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలలో ఎక్కువగా వ్యాపిస్తుందని నిపుణులు తెలిపారు. తల్లిదండ్రులు పిల్లల్లో వచ్చే హెపటైటిస్ వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. ఒక వేళా వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆరోగ్య నిపుణులను సంప్రదించాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి