AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shilpa Shetty: మా ఆయన బంగారం.. భర్త రాజ్ కుంద్రాకు క్లీన్ చిట్ ఇచ్చేసిన శిల్పా శెట్టి..

పోర్న్ చిత్రాల కేసులో అరెస్టయిన తన భర్త రాజ్ కుంద్రా అమాయకుడని, తనకు ఈ చిత్రాల రాకెట్ తో సంబంధం లేదని అతని భార్య, నటి శిల్పా శెట్టి తెలిపింది కుంద్రా సాగిస్తున్నట్టు చెబుతున్న హాట్ షాట్ యాప్ లోని కంటెంట్ గురించి తనకు తెలియదని...

Shilpa Shetty: మా ఆయన బంగారం.. భర్త రాజ్ కుంద్రాకు క్లీన్ చిట్ ఇచ్చేసిన శిల్పా శెట్టి..
My Husband Innocent
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: Jul 24, 2021 | 4:10 PM

Share

పోర్న్ చిత్రాల కేసులో అరెస్టయిన తన భర్త రాజ్ కుంద్రా అమాయకుడని, తనకు ఈ చిత్రాల రాకెట్ తో సంబంధం లేదని అతని భార్య, నటి శిల్పా శెట్టి తెలిపింది కుంద్రా సాగిస్తున్నట్టు చెబుతున్న హాట్ షాట్ యాప్ లోని కంటెంట్ గురించి తనకు తెలియదని, పోర్నోగ్రసఫిక్ చిత్రాలను తీయడంలో తన భర్త పాత్ర ఏదీ లేదని ఆమె వెల్లడించింది. పైగా పోర్నోగ్రఫీకి, ఏరోటికాకు మధ్య ఉన్న తేడాను గుర్తించాలని ఆమె చెప్పింది. ఎరోటికా కేవలం లైంగిక భావనలను రేకెత్తించేదని కానీ, పోర్నోగ్రఫీ అంటే అశ్లీల., అసభ్యకర చిత్రాలతో కూడుకున్నదని ఆమె వివరించింది. తన భర్త కేవలం ఎరోటికా మూవీలే తీసేవాడని పరోక్షంగా అంగీకరించింది. లండన్ లో ఉంటున్న కుంద్రా బ్రదర్-ఇన్-లా (బావ) ప్రదీప్ బక్షి హాట్ షాట్ యాప్ తో ఈ విధమైన (పోర్న్) చిత్రాలు తీస్తుంటాడని శిల్పా శెట్టి వెల్లడించింది. కానీ కుంద్రా మాత్రం ఇలాంటి మూవీలు తీయడని పేర్కొంది.

హాట్ షాట్ యాప్ లో నా ప్రమేయమేమీ లేదు…ఈ యాప్ ద్వారా నేనేమీ లాభాలు సంపాదించలేదు అని ఆమె స్పష్టం చేసింది. నిజానికి ఇతర ఓటీటీ వేదికల్లో వచ్చే కంటెంట్ అసభ్యకరంగా, అశ్లీలంగా ఉంటుందని, మరి వాటి విషయం ఎవరూ పట్టించుకోరని ఆమె అభిప్రాయపడింది. ఇలా ఈమె చెప్పిన విషయాలనన్నీ ముంబై పోలీసులు రికార్డు చేశారు. ఇలా ఉండగా కుంద్రాకు ఎస్ బ్యాంకు, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఆఫ్రికా లలో ఉన్నఅకౌంట్ల నుంచి రూ. .7.5 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన బూతు చిత్రాల ప్రొడక్షన్, పంపిణీ, అమ్మకం తదితరాలపై చర్చించుకునేందుకు కుంద్రా వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేసుకున్నాడట.. యాప్ ద్వారా వచ్చే నిధులను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకునేవాడట.

మరిన్ని ఇక్కడ చూడండి: Hyderabad: ట్రాఫిక్ జామ్ లో చిక్కున్న అంబులెన్స్ .. దారి ఇబ్బడానికి ప్రోటోకాల్ అడ్డు అంటూ పోలీసు వాదన

CM KCR: ‘దళితుల భవిష్యత్ గురించే ఆలోచిస్తున్నాం’.. ఎంపీటీసీ భర్తతో మాట్లాడిన సీఎం కేసీఆర్.. ఆడియో వైరల్