భారత-పాకిస్తాన్ దేశాలు నిజమైన మిత్రుల్లా ఉండాలి, అదే నా కల, మలాలా యూసుఫ్ జాయ్.

భారత-పాకిస్తాన్ దేశాలు రెండూ నిజమైన మిత్ర దేశాలుగా ఉండాలని, అదే తన స్వప్నమని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసుఫ్ జాయ్ తెలిపింది..

  • Umakanth Rao
  • Publish Date - 6:57 pm, Sun, 28 February 21
భారత-పాకిస్తాన్ దేశాలు నిజమైన మిత్రుల్లా ఉండాలి, అదే నా కల, మలాలా యూసుఫ్ జాయ్.

భారత-పాకిస్తాన్ దేశాలు రెండూ నిజమైన మిత్ర దేశాలుగా ఉండాలని, అదే తన స్వప్నమని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసుఫ్ జాయ్ తెలిపింది. సరిహద్దులు, డివిజన్లు అన్న పాత ఫిలాసఫీ ఇక పనికి రాదని, ఉభయదేశాల ప్రజలు శాంతి యుతంగా, సంతోషంగా ఉండాలనే తను కోరుతున్నానని ఆమె వెల్లడించింది. మైనారిటీలు ఇండియాలో ఉన్నా, పాకిస్తాన్ లో ఉన్నా ఎక్కడైనా సరే వారికీ రక్షణ అవసరమని ఆమె పేర్కొంది. ‘ఐ యామ్ మలాలా, ది స్టోరీ ఆఫ్ ది గర్ల్ హూ స్టుడ్ అప్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ వాజ్ షాట్ బై ది తాలిబన్’ పేరిట తాను రాసిన పుస్తకంపై జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ సందర్భంగా వర్చ్యువల్ గా నిర్వహించిన చర్చా గోష్టిలో ఆమె పాల్గొంది. ఇది ఒక మతానికి గానీ, ఒకకులానికి గానీ సంబంధించినది కాదని, ఇది అధికార దాహానికి సంబంధించినదని మలాలా వ్యాఖ్యానించింది. భారత, పాకిస్తాన్ దేశాలు ఒకదానికొకటి  గౌరవించుకోవాలని , ఈ దేశాల మధ్య ద్వేషం ఏ మాత్రం మంచిది  కాదని, ఇండియాలో బాలీవుడ్ మూవీలను పాకిస్థానీలు, పాక్ చిత్రాలను భారతీయులు చూడాలని, అలాగే డ్రామాలను కూడాఉభయ దేశాల వారు చూస్తుండాలని మలాలా కోరింది.

భారత-పాకిస్థాన్ దేశాలకు అసలైన శత్రువు పేదరికం, అసమానత వంటివని, వీటిని అధిగమించి ఇరు దేశాలు శాంతియుతంగా వాస్తవ మిత్రుల్లా ఉంటే తన కల నెరవేరినట్టేనని ఆమె వ్యాఖ్యానించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మైనారిటీల పట్ల దాడులు, హింస, అరాచకాలకు స్వస్తి పలకాలని, వారికీ రక్షణ ఎంతో అవసరమని ఆమె పేర్కొంది. బాలికలు ప్రతివారికీ విద్య అవసరమని, అన్ని దేశాల్లో ఇందుకు కృషి చేయాలన్నదే తన అభిమతమని ఆమె పునరుద్ఘాటించింది. పలు దేశాలు చాలావరకు ఈ విషయంలో కృత కృత్యమయ్యాయి. కానీ ఇంకా ఎంతో కృషి జరగాలి అని  మలాలా  కోరింది. మానవ హక్కుల కోసం పోరాడుతున్న భారతీయ యువతులను నేను అభినందిస్తున్నా అని ఆమె తెలిపింది.

Also Read:

BSNL Broadband: రూ. 299కే బీఎస్‌ఎన్‌ఎల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌ కనెక్షన్‌.. సరికొత్త ప్లాన్స్‌ అందుబాటులోకి..

Maynmar Protests: మయన్మార్ లో మళ్ళీ హింస, సైన్యం కాల్పుల్లో ఏడుగురి మృతి, అనేకమందికి గాయాలు