అయోధ్య విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసిన రాందేవ్

ఓ వైపు అయోధ్య రామజన్మ భూమి, బాబ్రీ మసీదు విషయంలో తీర్పు ఎలా రాబోతోందనన్న ఉత్కంఠతో సర్వత్రా ఎదురుచూస్తున్న వేళ.. ఇదే అంశంపై యోగా గురువు రాందేవ్ బాబా కూడా స్పందించారు. శ్రీ రాముడు అయోధ్యలోనే జన్మించారని.. ఈ విషయం ముస్లింలతో సహా.. యావత్ ప్రపంచానికి తెలుసన్నారు. అంతేకాదు అయోధ్యపై నెలకొన్న వివాదం తుది అంకానికి చేరుకుందన్నారు. ఆ స్థలంలో భవ్య రామ మందిర నిర్మాణం చేపట్టాలంటూ డిమాండ్‌ చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సందర్భంలో రాందేవ్ […]

అయోధ్య విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసిన రాందేవ్

Edited By:

Updated on: Oct 18, 2019 | 12:47 PM

ఓ వైపు అయోధ్య రామజన్మ భూమి, బాబ్రీ మసీదు విషయంలో తీర్పు ఎలా రాబోతోందనన్న ఉత్కంఠతో సర్వత్రా ఎదురుచూస్తున్న వేళ.. ఇదే అంశంపై యోగా గురువు రాందేవ్ బాబా కూడా స్పందించారు. శ్రీ రాముడు అయోధ్యలోనే జన్మించారని.. ఈ విషయం ముస్లింలతో సహా.. యావత్ ప్రపంచానికి తెలుసన్నారు. అంతేకాదు అయోధ్యపై నెలకొన్న వివాదం తుది అంకానికి చేరుకుందన్నారు. ఆ స్థలంలో భవ్య రామ మందిర నిర్మాణం చేపట్టాలంటూ డిమాండ్‌ చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సందర్భంలో రాందేవ్ బాబా ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, అక్టోబర్ 21న మహారాష్ట్ర, హర్యానాలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతిస్తున్న విషయం తెలిసిందే. ఇరు రాష్ట్రాల్లోని ఓటర్లు బీజేపీని గెలిపించాలంటూ పిలుపునిచ్చారు. ఇక జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేకహోదా కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసేందుకు కృషి చేసిన ప్రధాని మోదీ, అమిత్‌షాలను రాందేవ్ బాబా  అభినందించారు.