సీఏ పరీక్షలో అగ్రస్థానంలో నిలిచిన పేదింటి అమ్మాయి.. రాత్రిపూట చదువుకొని లక్ష్యాన్ని సాధించిన జరీన్‌ఖాన్..

|

Feb 13, 2021 | 2:22 PM

ముంబైలోని థానేకు చెందిన ఓ పేదింటి అమ్మాయి ఆలిండియా సీఏ పరీక్షలో అగ్రస్థానాన నిలిచి అందరిని ఆశ్చర్యపరిచింది. ముంబ్రాకు చెందిన జరీన్ ఖాన్ తన

సీఏ పరీక్షలో అగ్రస్థానంలో నిలిచిన పేదింటి అమ్మాయి.. రాత్రిపూట చదువుకొని లక్ష్యాన్ని సాధించిన జరీన్‌ఖాన్..
Follow us on

ముంబైలోని థానేకు చెందిన ఓ పేదింటి అమ్మాయి ఆలిండియా సీఏ పరీక్షలో అగ్రస్థానాన నిలిచి అందరిని ఆశ్చర్యపరిచింది. ముంబ్రాకు చెందిన జరీన్ ఖాన్ తన తల్లిదండ్రులు, ముగ్గురు తోబుట్టువులతో ఓ చిన్న ఇంటిలో నివసిస్తుంది. అన్ని రకాల సౌకర్యాలు, సదుపాయాలు ఉంటేనే ఇలాంటి పరీక్ష పాసవడం కష్టం. అలాంటిది ఎలాంటి సదుపాయాలు లేకుండా కేవలం రాత్రిపూట మాత్రమే చదువుకొని జరీన్ ఖాన్ ఈ ఘనత సాధించింది. ఈ సందర్భంగా జరీన్‌ఖాన్ తన గురించి, తన కుటుంబం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

సీఏ పరీక్ష రాయడానికి చాలా భయపడ్డానని, కానీ కుటుంబ సభ్యులు మద్దతు తెలపడంతో కష్టపడి చదివానని తెలిపింది. రెండేళ్ల గ్యాప్ తర్వాత గత సంవత్సరం పరీక్ష రాయాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. అయితే తన ఇల్లు రోడ్డు పక్కన ఉండటంతో నిత్యం వాహనాల శబ్ధాలు ఇబ్బందికి గురిచేసేవని, అందుకే తను రాత్రిపూట మాత్రమే చదువుకునేదానినని తెలిపింది. 4094 మంది విద్యార్థులు సీఏ పరీక్ష ఉత్తీర్ణత కాగా అందులో తను ఫస్ట్‌ ర్యాంక్‌లో నిలవడం సంతోషంగా ఉందని చెప్పింది. మొదటగా సీఏలో మొదటి స్థానంలో పాసయ్యవని ఫ్రెండ్స్ చెబితే నమ్మలేదని తర్వాత తెలుసుకొని ఆశ్చర్యపోయానని బదులిచ్చింది.

Ghatkesar Rape Case: ఘట్‌కేసర్‌ గ్యాంగ్ రేప్ కేసులో కొత్త ట్విస్ట్.. అసలు నిజాలు వెలుగులోకి..