Matrimonial Fraud: వీడు మామూలోడు కాదండోయ్.. ఏకంగా 40 మంది మహిళలను..

|

Jan 19, 2022 | 8:21 AM

Matrimonial Fraud: మ్యాట్రిమోనియల్ మోసానికి సంబంధించి ఎంబీఏ కమ్ బీటెక్ గ్రాడ్యుయేట్‌ను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు..

Matrimonial Fraud: వీడు మామూలోడు కాదండోయ్.. ఏకంగా 40 మంది మహిళలను..
Follow us on

Matrimonial Fraud: మ్యాట్రిమోనియల్ మోసానికి సంబంధించి ఎంబీఏ కమ్ బీటెక్ గ్రాడ్యుయేట్‌ను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు విశాల్ చవాన్(34) అలియాస్ అనురాగ్ చవాన్, తాను పెద్ద వ్యాపారవేత్తగా చెప్పుకుంటూ పెళ్లి చేసుకుంటాననే సాకుతో 35-40 మందిని మోసం చేశాడు. నెల రోజులుగా నిందితుడి కోసం వెతుకుతున్న క్రైం బ్రాంచ్ ఎట్టకేలకు కళ్యాణ్‌లో పట్టుకున్నారు.

వివరాల్లోకెళితే.. గతేడాది నిందితుడు చవాన్ మ్యాట్రిమోని సైట్‌ ద్వారా కుంజుర్‌మార్గ్‌కు చెందిన 28 ఏళ్ల మహిళతో పరిచయం చేసుకున్నాడు. తనను తాను పారిశ్రామికవేత్తగా చెప్పుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. ఫోన్‌లోనే మాట్లాడి మభ్యపెట్టాడు. అలా పెట్టుబడి పేరుతో మహిళ నుంచి రూ. 2.25 లక్షలు తీసుకున్నాడు. అనంతరం ఫోన్ ఆఫ్ చేసుకున్నాడు. అయితే, ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు 35 నుంచి 40 మంది మహిళలను మోసం చేశాడు. బాధిత మహిళలు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగు చూసింది. చవాన్ గుర్తింపు కార్డులు, సోషల్ మీడియా అకౌంట్లు అన్నీ ఫేక్ అని తేల్చారు పోలీసులు. చవాన్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. అతన్ని పట్టుకునేందుకు తీవ్రంగా శ్రమించారు.

చివరకు కళ్యాణ్‌లోని శ్రద్ధా మహల్ హోటల్‌లో ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే, చవాన్ అరెస్ట్ సినిమాటిక్‌గా జరిగింది. క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. డెలివరీ బాయ్‌గా నటిస్తూ హోటల్‌ రూమ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అలా చవాన్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

చవాన్ సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకుని, ఫేక్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రమ్, వాట్సాప్ అకౌంట్లు క్రియేట్ చేసి మహిళలలో పరిచయాలు పెంచుకునేవాడని పోలీసులు తెలిపారు. మ్యాట్రిమోనియల్ సైట్లు, సోషల్ మీడియాలో తానొక ధనిక వ్యాపారవేత్తగా ఫోజులు కొట్టేవాడన్నారు. అలా తనకు పరిచయం అయిన మహిళలను పెళ్లి చేసుకుంటానని చెప్పి వారి నుంచి డబ్బులు లాగేవాడన్నారు. గడిచిన రెండేళ్లలో చవాన్ 35-40 మంది మహిళల నుంచి రూ. 15-20 లక్షల వరకు మోసం చేసినట్లు గుర్తించారు. అలాగే ఐఫోన్‌ను తక్కువ ధరకు విక్రయిస్తానని చెప్పి 25-30 మంది నుంచి రూ. 20-30 లక్షల వరకు మోసం చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదిలాఉంటే.. చవాన్‌పై గతంలోనే అనేక కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వెర్సోవా, సియోన్ పోలీస్ స్టేషన్‌లో అత్యాచారం కేసు, దోపిడీ కేసుతో పాటు అనేక ఇతర చీటింగ్ కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు.

Also read:

SBI Scheme: కోవిడ్‌ సోకిన వారి కోసం ఎస్‌బీఐ ఈ ప్రత్యేక స్కీమ్‌ 3 నెలల ముందే నిలిపివేత.. ఇక రూ.20,000 పొందలేరు

Pawan Kalyan: నలుగురు పిల్లలతో పవన్ కళ్యాణ్.. నెట్టింట్లో వైరల్.. కనులకు విందు అంటున్న ప్యాన్స్..

Andhra Pradesh Politics: ఆసక్తి రేపుతున్న మంత్రాలయం రాజకీయాలు.. వైసీపీ నెక్ట్స్ ఎమ్మెల్యేగా అతనేనా?..