
అడ్రస్ వెరిఫికేషన్ కోసం వచ్చిన మహిళా ఉద్యోగితో ఒక వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన ముంబైలోని బోరివలిలో వెలుగు చూసింది.
ఈ ఘటన 2020లో జరగగా తాజాగా నిందితుడికి కోర్టు శిక్ష వేయడంతో కేసు వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
బోరివలికి చెందిన నరేంద్ర రఘునాథ్ సగ్వేకర్ అనే వ్యక్తి స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ బ్యాంక్‌తో కొత్త ఖాతా రవడానికి దరఖాస్తు చేసుకున్నాడు.
ఇక సాధారణ ప్రక్రియలో భాగంగా సదరు బ్యాంక్‌లో డిప్యూటీ మేనేజర్‌గా పనిచేస్తున్న ఒక మహిళా ఉద్యోగిని.. 2020 నవంబర్ 27న అడ్రస్
విరిఫికేషన్ కోసం సగ్వేకర్ నివాసానికి వచ్చింది.
ఈ క్రమంలో సగ్వేకర్ సదురు మహిళా ఉద్యోగిని పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు అమెను అనుచితంగా తాకి ముద్దు పెట్టుకున్నట్టు బాధితురాలు ఆరోపించింది. దీంతో ఎలాగోలా సగ్వేకర్ నుంచి తప్పించుకున్న సదురు మహిళా ఉద్యోగి వెంటనే బ్యాంక్‌కు చేరుకొని అక్కడ జరిగిన విషయం మొత్తాన్ని మేనేజర్, సిబ్బందికి తెలిపింది. దీంతో బ్యాంక్ అధికారులు బాధిత మహిళతో పాటు స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సగ్వేకర్‌పై ఫిర్యాదు చేశారు.
బాధితురాలి ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక విచారణలో భాగంగా నిందితుడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టారు. ఆ తర్వాత అతన్ని కోర్టులో హాజరుపర్చారు. ఘటనపై విచారణ సందర్భంగా మహిళ వాంగ్మూలంలో తప్పులు ఉన్నాయని, అంతేకాకుండా ప్రత్యక్ష సాక్షాలు కూడా ఎవరూ లేరని సగ్వేకర్ తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మరోవైపు మహిళా ఉద్యోగి తరపు న్యాయవాది అతని వాదనలుల్లో వాస్తవం లేదని తెలిపారు. ఇదరువైపుల వాదనలు విన్న కోర్టు మహిళ వాదన స్థిరంగా, నమ్మదగిందిగా ఉందని అభిప్రాయపడ్డారు.
ఈ క్రమంలో సగ్వేకర్ అనే వ్యక్తిని దోషిగా తేల్చుతా అతడి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు అతని ఏడాది జైలు శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. కోర్టు ఆదేశాలతో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు జైలుకు తరలించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.