Cyber Crime: రాంగ్ నంబర్ డయల్ చేసి రూ.లక్ష పొగొట్టుకున్నాడు.. ఎలా జరిగిందంటే

|

Jun 03, 2023 | 9:22 PM

ఈ మధ్య సైబర్ క్రైం మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొందరు వేలు లక్షలు పోగొట్టుకుంటే మరికొందరు కోట్లు కూడా పోగొట్టుకుంటున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ముంబయిలో మరో వ్యవహారం వెలుగుచూసింది.

Cyber Crime: రాంగ్ నంబర్ డయల్ చేసి రూ.లక్ష పొగొట్టుకున్నాడు.. ఎలా జరిగిందంటే
Phone
Follow us on

ఈ మధ్య సైబర్ క్రైం మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొందరు వేలు లక్షలు పోగొట్టుకుంటే మరికొందరు కోట్లు కూడా పోగొట్టుకుంటున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ముంబయిలో మరో వ్యవహారం వెలుగుచూసింది. తన లగేజ్ ఎక్కడుందో తెలుసుకునేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి కొరియర్ పేరు సంస్థను తప్పుగా టైప్ చేయడంతో రూ.లక్ష పొగొట్టుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే మలాడ్ ప్రాంతానికి ఏ వ్యక్తి(69) ఇటీవల బెంగళూరు వెళ్లి తిరిగి ముంబయికి వచ్చాడు. అయితే తనవద్ద ఉన్న అదనపు లగేజీని ముందుగానే కొరియర్‌లో పంపించాడు. ఆ తర్వాత తన లగేజీ ఎక్కడుందో తెలుసుకునేందుకుగానూ ఆ కొరియర్‌ సంస్థ కస్టమర్‌ కేర్‌ నంబర్‌ కోసం ఆన్‌లైన్‌లో వెతికాడు.

అలా వెతుకుతుండగా పొరపాటున వేరే పేరు టైప్‌ చేయడంతో మరో నంబర్‌ లభ్యమైంది. దాన్ని సంప్రదించగా.. ఓ వ్యక్తి తనను తాను రాహుల్‌ శర్మగా పరిచయం చేసుకున్నాడు. కొరియర్ ఛార్జీలపై రూ.5 జీఎస్టీ చెల్లించనందుకే పార్శిల్ నిలిచిపోయిందంటూ నమ్మబలికాడు. ఈ విషయంలో సహాయం చేస్తానంటూ నమ్మించి.. ఆయన బ్యాంకు ఖాతాతో అనుసంధానమై ఉన్న యూపీఐ వివరాలు చెప్పించుకున్నాడు. చివరికి బాధితుడి అకౌంట్‌ నుంచి సుమారు రూ.లక్ష బదిలీ చేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత మోసపోయానంటూ తనకు తాను తెలుసుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి