Crime News: పబ్లిక్‌ ప్లేస్‌లో ఆపని చేయొద్దన్నందుకు కత్తితో దాడి..

తప్పతాగి మత్తులో తూలుతూ పబ్లిక్‌ ప్లేస్‌లో మూత్ర విసర్జన చేయవద్దని అన్నందుకు పోలీసుపై విచక్షణారహితంగా దాడి చేశాడు ఓ వ్యక్తి. వివరాల్లోకెళ్తే..

Crime News: పబ్లిక్‌ ప్లేస్‌లో ఆపని చేయొద్దన్నందుకు కత్తితో దాడి..
Man Attacks Police With Knife

Updated on: Dec 23, 2022 | 10:04 AM

తప్పతాగి మత్తులో తూలుతూ పబ్లిక్‌ ప్లేస్‌లో మూత్ర విసర్జన చేయవద్దని అన్నందుకు పోలీసుపై విచక్షణారహితంగా దాడి చేశాడు ఓ వ్యక్తి. వివరాల్లోకెళ్తే..

ముంబయిలోని కందివలి ప్రాంతంలో రామ్ గోండే అనే వ్యక్తి సోమవారం రాత్రి బహిరంగ ప్రదేశంలో మూత్ర విసర్జన చేస్తూ కనిపించాడు. దీంతో ప్రజలు అసౌకర్యానికి గురైనప్పటికీ ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోతున్నారు. ఇంతలో కందివాలి పోలీస్ స్టేషన్‌కు చెందిన ఉదయ్ కదమ్ అనే పోలీసు అతన్ని చూసి బహిరంగ ప్రదేశంలో మూత్ర విసర్జన చేయవద్దని కోరాడు.

ఐతే పోలీసు మాటలను పట్టించుకోకుండా తనపనిలో తానునున్నాడు. చెర్రెత్తుకొచ్చిన పోలీస్‌ అతనిపై కేసు పెడతానని బెదిరించాడు. వెంటనే నిందితుడు తన వద్ద ఉన్న కత్తితో పోలీస్‌పై దాడికి దిగాడు. స్థానికులు చూసి కందివలి పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్ట్‌ చేశారు. తీవ్రగాయాలపాలైన బాధిత పోలీసును సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రై వార్తల కోసం క్లిక్‌ చేయండి.