Local Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆర్థిక రాజధానిలో లోకల్ ట్రైన్ సర్వీసులు.. కానీ అనుమతి మాత్రం..

Mumbai Local Trains: కరోనావైరస్ ప్రారంభం నాటినుంచి జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. ఎన్నో రంగాలు దీని బారిన పడి విలవిలలాడాయి. రవాణా రంగం

Local Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆర్థిక రాజధానిలో లోకల్ ట్రైన్ సర్వీసులు.. కానీ అనుమతి మాత్రం..
Mumbai Local Trains

Updated on: Aug 09, 2021 | 9:10 AM

Mumbai Local Trains: కరోనావైరస్ ప్రారంభం నాటినుంచి జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. ఎన్నో రంగాలు దీని బారిన పడి విలవిలలాడాయి. రవాణా రంగం కూడా పూర్తిగా దెబ్బతింది. అయితే.. సెకండ్ వేవ్ అనంతరం పరిస్థితులు ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక రాజధాని ముంబై మహా నగరంలో ఈ నెల 15వ తేదీ నుంచి లోకల్‌ రైళ్లను ప్రారంభించనున్నట్లు సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ఆదివారం ప్రకటించారు. అయితే.. షరతులతో ప్రయాణికులను అనుమతించనున్నట్లు ఆయన వెల్లడించారు. టీకాలు తీసుకున్న వారికే లోకల్ రైళ్లలో అనుమతించనున్నట్లు స్పష్టంచేశారు. కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో ముంబైలో ఏప్రిల్‌ నుంచి సాధారణ ప్రయాణికుల సేవలు నిలిపివేశారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు, అత్యవసర సేవల సిబ్బందికి మాత్రమే లోకల్ ట్రైన్స్‌లోకి అనుమితుస్తున్నారు. ప్రయాణానికి కనీసం 15 రోజుల ముందు తప్పనిసరిగా రెండో మోతాదు తీసుకున్న వారికే అనుమతి ఉంటుందంటూ రైల్వే అధికారులు, బీఎంసీ అధికారులు తెలిపారు.

ఈ మేరకు యాప్‌ను సైతం రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. దీనిని సోమవారం విడుదల చేయనున్నారు. లోకల్ ట్రైన్స్‌లో ప్రయాణించే వారు యాప్‌లో టీకా.. వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌లు లేని వారి కోసం.. స్థానిక మున్సిపల్ వార్డు కార్యాలయాలు, సబర్బన్ రైల్వే స్టేషన్లలో పాస్ కోసం దరఖాస్తు చేసుకునే విధంగా అవకాశం కల్పించనున్నారు. కాగా.. సోమవారం జరిగే కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ సమావేశం అనంతరం మాల్స్‌, రెస్టారెంట్లతో పాటు పలు సడలింపులు ఇవ్వనున్నట్లు ఉద్ధవ్‌ ఠాక్రే తెలిపారు. ప్రతీ ఒక్కరూ కరోనా నియమాలను పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సెకండ్‌ వేవ్‌ నుంచి ఇంకా పూర్తిగా భయటపడలేదని, థర్డ్‌ వేవ్‌ ప్రమాదం పొంచిఉందని.. జాగ్రత్తగా ఉండాలంటూ రాష్ట్ర ప్రజలకు సూచించారు.

Also Read:

KFC Chicken: అక్కడ చికెన్‌ లొట్టలేసుకుంటూ తింటున్నారా..? మీకు ఇలాంటి ఉడికిఉడకని పీస్‌లు కూడా రావొచ్చు..

Viral Video: వామ్మో.. భారీగా విరిగిపడిన కొండచరియలు.. ఒళ్లు గగుర్పొడుస్తున్న భయానక దృశ్యాలు