Mumbai Lady Cop: 50 మంది నిరుపేద చిన్నారులను దత్తత తీసుకుని చదివిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్

|

Jun 13, 2021 | 10:07 AM

Mumbai Lady Cop: ఖాకీలకు కూడా మానవత్వం ఉంటుంది. తమ విధులను నిర్వర్తించడానికి కరుకుదనం చూపించినా ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు తమ ప్రాణాలను సైతం..

Mumbai Lady Cop: 50 మంది నిరుపేద చిన్నారులను దత్తత తీసుకుని చదివిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్
Mumabi Lady Cop
Follow us on

Mumbai Lady Cop: ఖాకీలకు కూడా మానవత్వం ఉంటుంది. తమ విధులను నిర్వర్తించడానికి కరుకుదనం చూపించినా ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వారిని ఆడుకుంటారు. కరోనా వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఎంతో మంది పోలీసులు మానవత్వం చూపుతూ.. బాధితులను అండగా నిలిబడిన సంఘటనలు అనేకం. తాజాగా ముంబై కు చెందిన ఓ మహిళా పోలీస్ కానిస్టేబుల్ ఓ వైపు విధులను నిర్వహిస్తూనే మరో వైపు నిరుపేదల చిన్నారులకు అండగా నిలుస్తుంది. వివరాల్లోకి వెళ్తే..

షేక్ రెహానా ఓ వైపు పోలీసు కానిస్టేబుల్ గా నిర్వర్తిస్తూనే మరోవైపు , సమాజం పట్ల ఎంతో బాధ్యతగా ఉంటుంది. నిరుపేద బాలబాలికల చదువుకు రెహానా సహకరిస్తుంది. ఇలా 50 మంచి చిన్నారులను దత్తత తీసుకుని వారి ఆలనా పాలనా చూడడమే కాదు.. చదువుకోవడానికి సహాయం చేస్తుంది. ఈ బాలబాలికలందరూ ఒకే స్కూల్ కు చెందిన వారు. రెహానా కు ఏమాత్రం ఖాళీ దొరికినా వెంటనే చిన్నారుల ముందుకు చేరుకుంటారు. ఆ చిన్నారులతో సంతోషంగా గడుపుతారు. అయితే తాను పనిని ఒక్కదానిని చేయడం లేదని.. తన కుటుంబం అండగా నిలబడిందని చెబుతారు. ఓ వైపు కుటుంబ సభ్యుల ఆవాసరాలను తీరుస్తూ ఇల్లాలిగా బాధ్యత నిర్దిస్తున్నానే మరో వైపు 50 మంది చిన్నారుల బాధ్యతను చక్కగా చూసుకుంటున్నారు. రెహానా భర్త కూడా పోలీస్ శాఖలోనే ఉద్యోగం చేస్తారు.

అయితే రెహానా కూతురు పుట్టిన రోజున ఓ స్నేహితురాలి చూపించిన ఫోటోలు తనను ఈ పనిచేసేలా ఆలోచింపజేశాయని రెహానే చెప్పారు. ఈ చిన్నారులు 10 వ తరగతి పూర్తి అయ్యే వరకూ ఖర్చు మొత్తం భరించాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. రెహానా చేస్తున్న మంచి పనికి భర్త అండగా నీలబడడమే కాదు.. పోలీసు ఉన్నతాధికారులు కూడా ప్రశంశల వర్ధం కురిపిస్తున్నారు.

Also Read: ఆ పట్టణంలో తగ్గిపోతున్న జనాభా.. రూ.12లకే ఇల్లు అంటూ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. కండిషన్స్ అప్లై