National: ఐఏఎస్‌ ఆఫీసర్‌ అయ్యుండి ఇదేం పని.. బెడ్‌రూమ్‌లోకి ఇంటర్నెట్‌ రావట్లేదని..

వివరాల్లోకి వెళితే.. ముంబయికి చెందిన అమన్‌ మిట్టల్‌ ప్రస్తుతం మహారాష్ట్ర నీటి సరఫరా, పారిశుద్ధ్య శాఖ డిప్యూటీ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలోనే ముంబయిలోని తన ఇంట్లో ఓ టెలికం కంపెనీకి సంబంధించి ఇంటర్నెట్ కనెక్షన్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. అయితే బెడ్ రూమ్‌లోకి ఇంటర్నెట్‌ సరిగ్గా రావడం లేదని ఫిర్యాదు చేశాడు. దీంతో ఇంటర్నెట్ కంపెనీకి చెందిన...

National: ఐఏఎస్‌ ఆఫీసర్‌ అయ్యుండి ఇదేం పని.. బెడ్‌రూమ్‌లోకి ఇంటర్నెట్‌ రావట్లేదని..
IAS Officer

Updated on: Jan 04, 2024 | 2:32 PM

సమాజంలో గౌరవప్రదమైన హోదాలో ఉండి కూడా కొందరికి ఎలా ప్రవర్తించాలో తెలియదు. పైగా అధికారం ఉంది కదా ఏది చేసినా చెల్లుతుందనే భావనలో ఉంటారు. తాజాగా ముంబయిలో జరిగిన ఓ సంఘటన దీనికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది. బెడ్‌ రూమ్‌లోకి ఇంటర్‌నెట్ సరిగ్గా రావడం లేదన్న కారణంతో ఇంటర్నెట్ సర్వీస్‌ ప్రొవైడర్‌ సంస్థకు చెందిన ఉద్యోగులను ఓ ఐఏఎస్‌ అధికారి చితకబాదిన సంఘటన చర్చనీయాంశంగా మారింది.

వివరాల్లోకి వెళితే.. ముంబయికి చెందిన అమన్‌ మిట్టల్‌ ప్రస్తుతం మహారాష్ట్ర నీటి సరఫరా, పారిశుద్ధ్య శాఖ డిప్యూటీ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలోనే ముంబయిలోని తన ఇంట్లో ఓ టెలికం కంపెనీకి సంబంధించి ఇంటర్నెట్ కనెక్షన్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. అయితే బెడ్ రూమ్‌లోకి ఇంటర్నెట్‌ సరిగ్గా రావడం లేదని ఫిర్యాదు చేశాడు. దీంతో ఇంటర్నెట్ కంపెనీకి చెందిన ఇద్దరు వ్యక్తులు రూటర్‌ సమస్యను పరిష్కరించేందుకు మిట్టల్‌ నివాసానికి వచ్చారు. ఈ సమయంలో బెడ్‌ రూమ్‌లోకి సరిగ్గా ఇంటర్నెట్ రావడం లేదంటూ.. ఉద్యోగులతో మిట్టల్‌ వాగ్వాదానికి దిగాడు.

దీంతో ఐఏఎస్‌ అధికారి మిట్టల్‌.. అతని సోదరుడితో కలిసి ఉద్యోగులపై దాడికి దిగారు. ఇంటర్నెట్‌ సంస్థలో పనిచేస్తున్న సాగర్‌ మాంధ్రే తనపై దాడి చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిట్టల్, అతని సోదరుడు దేవేష్‌తో కలిసి భవనంలోని నలుగురు సెక్యూరిటీ గార్డులు తనపై దాడి చేశారని మాంధ్రే తెలిపారు. సేల్స్ టీమ్‌లో పనిచేస్తున్న మాంధ్రేతో పాటు అతని సహోద్యోగి భూషణ్ గుజార్‌పై దాడి చేశారని ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. మిట్టల్ సోదరులు, నలుగురు సెక్యూరిటీ గార్డులపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. మిట్టల్ ఫిర్యాదు ఆధారంగా ఐఏఎస్‌ ఆఫీసర్‌లపై ఐపీసీ సెక్షన్‌ 324 కింద నేరం నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..