ఆరంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం.. భారీగా కార్లు, బైకులు దగ్ధం..పదుల సంఖ్యలో ప్రజలు..!

|

Oct 06, 2023 | 8:18 AM

భవనంలోని పార్కింగ్‌లో మంటలు చెలరేగి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు అధికారులు. అక్కడ ఉన్న పాత బట్టలు, చెత్తా చెదారం కారణంగానే ప్రమాదం తీవ్రత పెరిగిందన్నారు. కొద్దిసేపటికే మంటలు పార్కింగ్‌తో సహా మొదటి, రెండవ అంతస్తులకు వ్యాపించాయి. పరిస్థితి అదుపులోకి తెచ్చిన సహాయక సిబ్బంది క్షతగాత్రులందరినీ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రమాదం జరిగిన భవనం గ్రౌండ్‌ ఫ్లోర్‌ పై ఐదు అంతస్తులుగా ఉంది.

ఆరంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం.. భారీగా కార్లు, బైకులు దగ్ధం..పదుల సంఖ్యలో ప్రజలు..!
Fire Accident
Follow us on

Mumbai Goregaon Fire: ముంబైలోని గోరేగావ్‌లో భారీ ప్రమాదం సంభవించింది. ఇక్కడి సమర్థ్ అనే భవనం పార్కింగ్ స్థలంలో గురువారం రాత్రి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దాదాపుగా ఈ ప్రమాదంలో 30 మందికి పైగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 30కి పైగా బైక్‌లు, 4 కార్లు మంటల్లో దగ్ధమయ్యాయి. అగ్నిప్రమాదానికి సంబంధించిన సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక దళం సంఘటనా స్థలానికి చేరుకుంది.ప్రాథమిక సమాచారం ప్రకారం..వెంటనే.. 10 కి పైగా అగ్నిమాపక దళ వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. తక్కువ సమయంలోనే మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కానీ, అప్పటికే మంటలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. అగ్నిప్రమాదానికి కారణమేమిటనే సమాచారం తెలియరాలేదు. ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలపై స్థానిక పోలీసులు, అగ్నిమాపక శాఖ ఆరా తీస్తున్నారు.

భవనంలోని పార్కింగ్‌లో మంటలు చెలరేగి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు అధికారులు. అక్కడ ఉన్న పాత బట్టలు, చెత్తా చెదారం కారణంగానే ప్రమాదం తీవ్రత పెరిగిందన్నారు. కొద్దిసేపటికే మంటలు పార్కింగ్‌తో సహా మొదటి, రెండవ అంతస్తులకు వ్యాపించాయి. పరిస్థితి అదుపులోకి తెచ్చిన సహాయక సిబ్బంది క్షతగాత్రులందరినీ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రమాదం జరిగిన భవనం గ్రౌండ్‌ ఫ్లోర్‌ పై ఐదు అంతస్తులుగా ఉంది. ఇందులో గ్రౌండ్‌ ఫ్లోర్‌లో చెలరేగిన మంటలు పై రెండు అంతస్తులకు ఎగబాకిందని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..