Mumbai Fire Accident: 12 అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం.. ప్రాణాలను రక్షించుకునేందుకు..

మహారాష్ట్ర రాజధాని ముంబై మహా నగరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. చెంబూర్‌లో 12 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి.

Mumbai Fire Accident: 12 అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం.. ప్రాణాలను రక్షించుకునేందుకు..
Mumbai Fire Accident

Updated on: Oct 08, 2022 | 5:07 PM

మహారాష్ట్ర రాజధాని ముంబై మహా నగరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. చెంబూర్‌లో 12 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. ఈ భవనంలో చాలామంది చిక్కుకున్నారు. ప్రాణాలను రక్షించుకునేందుకు చాలామంది కిటికీల నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

చెంబూర్‌లోని న్యూ తిలక్ నగర్ ప్రాంతంలోని నివాస భవనంలో శనివారం మధ్యాహ్నం ఈ అగ్నిప్రమాదం జరిగింది. చాలా మంది నివాసితులు తమ ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నంలో బాల్కనీలకు వేలాడుతూ కనిపించారని అధికారులు తెలిపారు. ముంబై అగ్నిమాపక దళం (MFB) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మంటలను అదుపు చేసేందుకు కనీసం 8 అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.

ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 2:43 గంటలకు అగ్నిమాపక శాఖకు సమాచారం అందినట్లు వెల్లడించారు. అధికార యంత్రాంగం మొత్తం అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. అదరినీ సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..